ప్రభుత్వ ఉపాధ్యాయులు మారాలి | Government teachers should | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉపాధ్యాయులు మారాలి

Published Fri, Aug 1 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

Government teachers should

  •         విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
  •        విద్యాహక్కు చట్టం సదస్సులో కలెక్టర్ కిషన్
  • విద్యారణ్యపురి : వ్యవస్థను మనమే బాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ సూచించారు. సర్వశిక్షాభియాన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండలోని అంబేద్కర్ భవనంలో విద్యాహక్కుచట్టం అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ హాజరై మాట్లాడుతూ 1200 మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, జిల్లా కేంద్రంలో అమరుల కీర్తిస్థూపం కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

    అక్షరాస్యతలో జిల్లా 2 నుంచి 3 శాతం వరకు వెనుకబడి ఉందన్నారు. అందులో బాలికల అక్షరాస్యత ఇంకా తక్కువగా ఉందని తెలిపా రు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోందన్నా రు. ప్రైవేట్‌కు దీటుగా విద్యార్థులకు నాణ్యమై న విద్యను అందించేందుకు ఇకనైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు మారాల్సిన అవసరం ఉందన్నారు.

    పీజీ, బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులు కూడా తమ వద్దకు వచ్చి అటెండర్ ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేస్తున్నారని.. ఇందుకు వారిలో సరైన నైపుణ్యాలు లేకపోవడమే కారణమన్నారు. నైపుణ్యాలు ఉన్న కొందరికే ఉద్యోగాలు వస్తున్నాయని, నైపుణ్యాలు లేని వారు చిన్నచిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ ఉ పాధ్యాయులుగా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించకుంటే.. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలా నమ్మకం కలిగిస్తామో ఆ లోచించాలని పేర్కొన్నారు.

    విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించకపోతే భవిష్యత్‌లో వారు యాంటీ సోషల్ ఎలిమెంట్‌గా మారితే ఎవరు బాధ్యులవుతారని ఆయన ప్రశ్నించా రు. అందరితోపాటు జిల్లా కలెక్టర్‌గా తాను కూడా బాధ్యుడినే అవుతానన్నారు. ఇక్కడ హా జరైన వారందరూ తెలుగు మీడియం చదివినవారేనని.. తాను కూడా తెలుగు మీడియంలో ప్రభుత్వ స్కూల్‌లో చదువుకున్నానని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను నేరు గా తన దృష్టికి తీసుకురావచ్చని, తనకు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

    పాఠశాల ఆవరణలో విద్యార్థులతో మొక్కలు నాటించాలని హెచ్‌ఎంలకు సూచిం చారు. ఇప్పటివరకు జరిగింది వదిలేద్దాం, ఇక నుంచైనా మారి విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించేందుకు కృషిచేద్దాం అని సదస్సు కు హాజరైన ఉపాధ్యాయులతో అనిపించారు.
     
    జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్, ఎస్‌ఎస్‌ఏ ఇన్‌చార్జ్ పీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా బడిలో ప్రవేశం కల్పించాలని కోరారు. ఇటీవల 17 బృందాలతో పాఠశాలల్లోని మరుగుదొడ్లు, నీటి వసతిని పరిశీలించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిక అందజేశామని తెలిపారు. ఎంఈఓలు కూడా తమకు నివేదికలు ఇవ్వాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ ఈఈ రవీందర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో శిథిలావస్థకు చేరిన 742 పాఠశాలల గదులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల సహకారంతోనే కూల్చివేయాలని సూచించారు.
     
    ఎస్‌ఎస్‌ఏ సీఎంఓ బి.మనోజ్‌కుమార్ మా ట్లాడుతూ రెండు ప్రొఫార్మాలతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల స్థితిగతులపై సర్వే చేయాలని సూచించారు. సర్వే బృందంలో ఎంఈఓ లు కన్వీనర్లుగా, సీఆర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ నెల 10 వరకు తమకు నివేదించాలన్నారు. సదస్సులో వరంగల్ డిప్యూటీ డీఈఓ డి.వాసంతి, ములుగు డిప్యూటీ డీఈఓ కృష్ణమూర్తి, ఎస్‌ఎస్‌ఏ ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఈఓ బి.రాధ, ప్రత్యామ్నాయ పాఠశాలల కోఆర్డినేటర్ మురళి, ఐఈడీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీఈ రమాదేవి, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, సీఆర్పీలు, ఎంఎల్‌టీఈలు పాల్గొన్నారు. చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇద్దరు ఉపాధ్యాయులు పాటలు పాడారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement