రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ విడుదలకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కేవలం వారం రోజుల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం సాయంత్రం 5.04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను రీలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా పూర్తి రన్‌టైమ్ ఎంతో సెన్సార్ ప్రకటించింది.
గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రన్‌టైమ్ 2:45 గంటలు ఉందని సెన్సార్ బోర్డ్ తెలిపింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం సాయంత్రం 2.43 నిమిషాల నిడివితో ట్రైలర్ విడుదల కానుంది. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ కావడం గ్యారెంటీ అంటూ అభిమానులు ఆశిస్తున్నారు. 'వినయ విధేయ రామ'చిత్రం తర్వాత రామ్ చరణ్– కియారా అద్వానీ రెండోసారి జోడీగా నటించారు.
రెమ్యునరేషన్ తగ్గించుకున్న చరణ్.. కారణం ఇదేనా..?
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఆయన నుంచి సినిమా విడుదల కానుంది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఈ సినిమా కోసం చరణ్ తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు దర్శకుడు శంకర్ కూడా చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. చరణ్ రూ. 60 కోట్లు, శంకర్ 30 కోట్లు మాత్రమే తమ రెమ్యూనరేషన్లుగా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.
అయితే, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే, రామ్ చరణ్ ఏ సినిమాకు అయిన ఓకే చెబితే.. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే తన రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది. ఆయన అడ్వాన్సులు వంటివి తీసుకోరట. అదే ఆయనకు ఇప్పుడు మైనస్ అయిందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా 2024లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ కారణం వల్ల ముందుగా అనుకున్న తన రెమ్యునరేషన్‌ను చరణ్ తగ్గించుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment