Aditi Shankar Get Movie Chance With Surya - Sakshi
Sakshi News home page

టాప్‌ హీరోతో ఛాన్స్‌ కొట్టేసిన అదితి శంకర్‌

Published Sun, Aug 20 2023 9:02 AM | Last Updated on Sun, Aug 20 2023 12:31 PM

Aditi Shankar Get Movie Chance With Surya - Sakshi

దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ ఎదుగుదల మామూలుగా లేదు. కార్తీకి జంటగా విరుమాన్‌ చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌ సరసన మావీరన్‌ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాష్‌ మురళికి జంటగా నటిస్తున్నారు. కాగా తదుపరి రాక్షసన్‌, చిత్రం ఫేమ్‌ రామ్‌కుమార్‌ తాజా చిత్రంలో నటించడానికి అదితి శంకర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు.

(ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత)

ఇప్పుడు నటుడు సూర్యతో జతకట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. కాగా ఇంతకుముందు సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటించిన సూర్య ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు.

కాగా ఈ సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కబోతోందనే విషయం తెలిసిందే. ఇది సూర్య నటించే 43వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్‌ నటించబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించనున్నారు. కాగా కార్తీతో నటించి విజయాన్ని అందుకున్న నటి అదితి శంకర్‌ ఇప్పుడు ఆయన అన్నయ్య సూర్యతో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. మరో విషయం ఏమిటంటే నటుడు సూర్య దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement