సినిమా రంగంలో సెంటిమెంట్ ఎక్కువేనని చెప్పక తప్పదు. ఒక్క హిట్ వస్తే చాలు సినిమా పరిశ్రమ నెత్తికెక్కించుకుంటుంది. అదే ఒక్క ప్లాప్ వచ్చినా, ఐరన్‌లెగ్ ముద్ర వేసేస్తారు. దర్శకుడు శంకర్ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన అదితి శంకర్ కథానాయకిగా తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. ఆమె నటించిన మొదటి చిత్రం కార్తీకు జంటగా 'విరుమాన్'లో నటించి హిట్ అందుకున్నారు. అందులో ఆమె గాయనిగానూ పరిచయం అయ్యారు. అదే విధంగా అదితి శంకర్ నటించిన రెండవ చిత్రం మహావీరన్ (మహావీరుడు) కూడా హిట్ అయ్యింది. దీంతో ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు.
ప్రస్తుతం ఆకాశ్ మురళికి జంటగా కోలీవుడ్‌లో నేశిప్పాయా అనే చిత్రంతో పాటు అర్జున్‌దాస్‌కు జంటగా మరో చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. వీటి తరువాత నటుడు అధర్యకు జంటగా ఇంకో చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నేశిప్పాయా చిత్రం ద్వారా దివంగత నటుడు మురళి రెండవ వారసుడు ఆకాశ్ మురళి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంపైనే ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
నేశిప్పాయా చిత్రంతో నటి అదితి శంకర్ తన సక్సెస్‌ను కొనసాగిస్తారా? హ్యాట్రిక్ కొడతారా? అన్నదే ప్రస్తుతం జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ఇందులోని తొలంజ మనసు అనే పల్లవితో సాగే పాటను తాజాగా విడుదల చేశారు. కాగా ఇందులో ప్రభు, శరత్‌కుమార్, కుష్భూ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment