సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న 'ప్రత్యర్థి' | Shankar Mudavat Debuting As A Director With Prathyardhi | Sakshi
Sakshi News home page

Prathyardhi Movie: సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న 'ప్రత్యర్థి'

Published Wed, Jan 4 2023 6:44 PM | Last Updated on Wed, Jan 4 2023 6:44 PM

Shankar Mudavat Debuting As A Director With Prathyardhi - Sakshi

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'ప్రత్యర్థి'. ఈ మూవీతోనే శంకర్ ముదావత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. జనవరి 6న ఈ సినిమా విడుదల కానుంది. దేవాకట్ట తెరకెక్కించిన ఆటో నగర్ సూర్య సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ నరోజ్ వద్ద అసిస్టెంట్‌ కెమెరామెన్‌గానూ చేశారు.  ఇప్పుడు ప్రత్యర్థి సినిమాతో తెలుగు ప్రేక్షకుల రానున్నారు.

ఇప్పటికే ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించారు. ఈ సినిమా బాగుందని కొత్త దర్శకుడైనా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని పలువురు కొనియాడారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని  సంజయ్ సాహ నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement