రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్‌.. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌! Ram Charan and Sankar Movie Game Changer Udpate Goes Viral | Sakshi
Sakshi News home page

Game Changer Movie: రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్‌.. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

Published Thu, Jun 27 2024 4:47 PM | Last Updated on Thu, Jun 27 2024 5:05 PM

Ram Charan and Sankar Movie Game Changer Udpate Goes Viral

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్‌ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ తాజా అప్‌డేట్‌ ఇచ్చారు. ఇండియన్‌ -2 ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో గేమ్ ఛేంజర్‌ గురించి ఆయన మాట్లాడారు.

శంకర్ మాట్లాడుతూ..'సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది. కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇండియన్‌ -2 రిలీజ్‌ కాగానే గేమ్ ఛేంజర్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తాం. అన్ని ఓకే అనుకున్నాకే రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా' అన్నారు.

కాగా.. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement