Kamal Haasan donnes a women getup after 15 years for Indian 2 movie - Sakshi
Sakshi News home page

Kamal Haasan: ఇండియన్‌– 2 కోసం మరో అవతారం ఎత్తనున్న కమల్‌ హాసన్‌

Published Mon, Jul 31 2023 7:43 AM | Last Updated on Mon, Jul 31 2023 8:24 AM

Indian 2 Movie In Kamal Haasan Women Look - Sakshi

పాత్రకు తగ్గట్టుగా మేకోవర్‌ అవడంలో నటుడు కమలహాసన్‌ తర్వాతే ఎవరైనా అని పేర్కొనవచ్చు. ఒకే చిత్రంలో పది పాత్రలు పోషించిన నటుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది విశ్వనటుడు కమలహాసన్‌ ఒకరే. పాత్రకు అవసరమైతే మేకప్‌ కోసమే గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తారాయన. అందుకు దశావతారం చిత్రమే ఒక ఉదాహరణ. అందులో పది పాత్రలు పోషించిన ఆయన ఒక్కో పాత్రలకు ఒక్కో విధంగా తయారైన తీరు అద్భుతమనే చెప్పాలి.

(ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్‌.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?)

ఆ చిత్రంలో ఒక వృద్ధ మహిళా పాత్ర కోసం కమలహాసన్‌ మేకోవర్‌ అయిన విషయం సంచలనమనే చెప్పాలి. కాగా అదేవిధంగా అవ్వై షణ్ముకి (భామనే సత్యభామనే) చిత్రంలో నడివయసు స్త్రీ పాత్రను పోషించి నేర్పించారు. పలువురు హీరోలు స్త్రీ  పాత్రలు పోషించినా పూర్తిస్థాయి మహిళా పాత్రల్లో నటించింది మాత్రం కమలహాసనే. కాగా తాజాగా ఆయన ఇండియన్‌– 2 చిత్రంలో మరోసారి మహిళగా అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి)

28 ఏళ్ల క్రితం కమలహాసన్‌ కథానాయకునిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్‌. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్‌, శంకర్ల కాంబినేషన్లో లైకా ప్రొడక్షనన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పలు అద్భుతాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథలో భాగంగా కమలహాసన్‌ స్త్రీ  పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో కమల్‌ స్త్రీ  గెటప్‌ ఎలా ఉంటుందని ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement