bhamane satyabhamane
-
ఇండియన్– 2 కోసం మరో అవతారం ఎత్తనున్న కమల్ హాసన్
పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవడంలో నటుడు కమలహాసన్ తర్వాతే ఎవరైనా అని పేర్కొనవచ్చు. ఒకే చిత్రంలో పది పాత్రలు పోషించిన నటుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది విశ్వనటుడు కమలహాసన్ ఒకరే. పాత్రకు అవసరమైతే మేకప్ కోసమే గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తారాయన. అందుకు దశావతారం చిత్రమే ఒక ఉదాహరణ. అందులో పది పాత్రలు పోషించిన ఆయన ఒక్కో పాత్రలకు ఒక్కో విధంగా తయారైన తీరు అద్భుతమనే చెప్పాలి. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ఆ చిత్రంలో ఒక వృద్ధ మహిళా పాత్ర కోసం కమలహాసన్ మేకోవర్ అయిన విషయం సంచలనమనే చెప్పాలి. కాగా అదేవిధంగా అవ్వై షణ్ముకి (భామనే సత్యభామనే) చిత్రంలో నడివయసు స్త్రీ పాత్రను పోషించి నేర్పించారు. పలువురు హీరోలు స్త్రీ పాత్రలు పోషించినా పూర్తిస్థాయి మహిళా పాత్రల్లో నటించింది మాత్రం కమలహాసనే. కాగా తాజాగా ఆయన ఇండియన్– 2 చిత్రంలో మరోసారి మహిళగా అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి) 28 ఏళ్ల క్రితం కమలహాసన్ కథానాయకునిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్, శంకర్ల కాంబినేషన్లో లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పలు అద్భుతాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథలో భాగంగా కమలహాసన్ స్త్రీ పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో కమల్ స్త్రీ గెటప్ ఎలా ఉంటుందని ఆసక్తి నెలకొంది. -
తెలుగు తెరపైకి కమల్ టబూల కూతురు!!
కమల్ హాసన్, టబు హీరో హీరోయిన్లుగా వచ్చిన 'చాచీ 420' చిత్రం గుర్తుంది కదూ. అందులో వాళ్ల కూతురిగా చేసిన చిన్నారి అప్పట్లోనే యాక్టింగ్ ఇరగదీసింది. ఆ సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు 17 ఏళ్లు గడిచాయి. దాంతో అప్పటి చిన్నారి.. ఇప్పుడు నిండు జవ్వనిగా తెలుగు తెరమీదకు వచ్చేస్తోంది. 'నువ్వు నేను ఒక్కటవుదాం' అనే సినిమాతో తెరంగేట్రం చేయడానికి సనా షేక్ సిద్ధమైంది. బాలనటిగా తాను చాలా సినిమాల్లో చేశానని.. కమల్ హాసన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమ్రిష్ పురి, కాజోల్, అజయ్ దేవ్‌గణ్.. ఇలా అందరితో కలిసి నటించానని ఆమె చెప్పింది. భామనే సత్యభామనే సినిమా షూటింగులో అయితే కమల్ హాసన్ స్వయంగా తనకు తలదువ్వి జడ వేశారని, వాళ్లెవ్వరూ ఇప్పుడు తనను గుర్తుపట్టలేకపోవచ్చని సనా తెలిపింది. ముంబైలో పుట్టి పెరిగిన సనా షేక్ ఇంతకుముందు తహాన్, ఆకాశవాణి లాంటి చిత్రాల్లో ఇటీవల నటించింది. తెలుగువాళ్లంతా చాలా అభిమానంగా ఉంటారని, డైలాగులు సరిగా చెప్పలేక తిప్పలు పడుతున్నా చాలా సహనంతో తనను భరించారని చెప్పింది. తాను నటిని కాకపోతే ఫొటోగ్రఫీ నేర్చుకుని సినిమాటోగ్రాఫర్ అయ్యి ఉండేదాన్నని, అయితే.. నటన మాత్రం తన ప్రాణమని సనా తెలిపింది. ఇంటర్ తర్వాత చదువును అటకెక్కించేసినట్లు కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది.