తెలుగు తెరపైకి కమల్ టబూల కూతురు!! | 'chachi 420' girl to debut in Tollywood | Sakshi
Sakshi News home page

తెలుగు తెరపైకి కమల్ టబూల కూతురు!!

Published Mon, Jun 30 2014 12:11 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తెలుగు తెరపైకి కమల్ టబూల కూతురు!! - Sakshi

తెలుగు తెరపైకి కమల్ టబూల కూతురు!!

కమల్ హాసన్, టబు హీరో హీరోయిన్లుగా వచ్చిన 'చాచీ 420' చిత్రం గుర్తుంది కదూ. అందులో వాళ్ల కూతురిగా చేసిన చిన్నారి అప్పట్లోనే యాక్టింగ్ ఇరగదీసింది. ఆ సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు 17 ఏళ్లు గడిచాయి. దాంతో అప్పటి చిన్నారి.. ఇప్పుడు నిండు జవ్వనిగా తెలుగు తెరమీదకు వచ్చేస్తోంది. 'నువ్వు నేను ఒక్కటవుదాం' అనే సినిమాతో తెరంగేట్రం చేయడానికి సనా షేక్ సిద్ధమైంది. బాలనటిగా తాను చాలా సినిమాల్లో చేశానని.. కమల్ హాసన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమ్రిష్ పురి, కాజోల్, అజయ్ దేవ్గణ్.. ఇలా అందరితో కలిసి నటించానని ఆమె చెప్పింది. భామనే సత్యభామనే సినిమా షూటింగులో అయితే కమల్ హాసన్ స్వయంగా తనకు తలదువ్వి జడ వేశారని, వాళ్లెవ్వరూ ఇప్పుడు తనను గుర్తుపట్టలేకపోవచ్చని సనా తెలిపింది.

ముంబైలో పుట్టి పెరిగిన సనా షేక్ ఇంతకుముందు తహాన్, ఆకాశవాణి లాంటి చిత్రాల్లో ఇటీవల నటించింది. తెలుగువాళ్లంతా చాలా అభిమానంగా ఉంటారని, డైలాగులు సరిగా చెప్పలేక తిప్పలు పడుతున్నా చాలా సహనంతో తనను భరించారని చెప్పింది. తాను నటిని కాకపోతే ఫొటోగ్రఫీ నేర్చుకుని సినిమాటోగ్రాఫర్ అయ్యి ఉండేదాన్నని, అయితే.. నటన మాత్రం తన ప్రాణమని సనా తెలిపింది. ఇంటర్ తర్వాత చదువును అటకెక్కించేసినట్లు కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement