ఆ ఇద్దరితో సీక్వెల్స్? | sequel to rajini and kamal-sankar | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితో సీక్వెల్స్?

Published Sat, Feb 22 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

ఆ ఇద్దరితో సీక్వెల్స్?

ఆ ఇద్దరితో సీక్వెల్స్?

 ఆ ఇద్దరితో సీక్వెల్స్?
 
 ప్రముఖ నటులు కమలహాసన్, రజనీకాంత్‌తో కలిసి స్టార్ డెరైక్టర్ శంకర్ కలిసి పనిచేయనున్నారన్న విషయం సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  శంకర్ చిత్రాలు భారీగాను, సాంకేతిక విలువలు, వైవిధ్యం, సమాజానికి చక్కని సందేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వందకోట్లు ఖర్చు పెట్టినా అందులో ప్రతి రూపాయి విలువ సిల్వర్ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎంత ఖర్చు పెట్టినా అంతకు రెట్టింపు నిర్మాతకు ఆర్జించిపెట్టే నటులు కమల్, రజనీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఈ ఇద్దరు దిగ్గజాలతో శంకర్ మళ్లీ చిత్రాలు చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు కమలహాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో కమలహాసన్ యువకుడిగా, వృద్ధుడిగా ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో టైటిల్ పాత్ర అవినీతితో వేళ్లూనుకునిపోరుున వ్యవస్థను కూకటి వేళ్లతో పెరికి వేయడానికి కంకణం కట్టుకున్న పాత్ర. ఈ పాత్ర సమాజంపై చాలా ప్రభావం చూపిందనే చెప్పాలి.అలాగే శంకర్, రజనీకాంత్ కలయికలో రూపొందిన మరో చిత్రం ఎందిరన్.

 

ఈ చిత్రంలో రజనీకాంత్ సైంటిస్టుగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశారు. వీటిలో రోబో పాత్ర ద్వారా చాలామందికి మంచి సందేశాన్నిచ్చారు దర్శకుడు. ఈ చిత్రం అశేష ప్రజాదరణను పొందింది. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించడానికి స్టార్ డెరైక్టర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్, ఎమిజాక్సన్ జంటగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఐ చిత్రాన్ని తెరపై ఆవిష్కరిస్తున్న ఈ దర్శక మేధావి ఎందిరన్, ఇండియన్ సీక్వెల్స్‌పై దృష్టి సారించనున్నట్లు కోలీవుడ్ టాక్.

 

రజనీకాంత్‌తో రూపొందించే ఎందిరన్ సీక్వెల్‌ను రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే నిర్మాత కోసం దర్శకుడు అన్వేషిస్తున్నారట. అలాగే సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. సూపర్‌స్టార్ మాత్రం కోచ్చడయాన్ విడుదల వరకు మరో చిత్రం గురించి ఆలోచన లేదంటున్నారట. దీంతో ఏప్రిల్ తర్వాత ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement