
ముగ్గురు సీఎంలకు ఫోన్ చేసిన కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులో మాట్లాడారు.
కేసీఆర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు. గవర్నర్ అధికారాల గురించి వారితో చర్చించారు. అంతకుముందు టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు.