ఆమె కాంగ్రెస్, లెప్ట్ లను మించిపోయింది
Published Fri, Apr 22 2016 6:08 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
బసీర్హాట్: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవినీతిలో, అరాచక పాలన కొనసాగించడంలో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలను మించి పోయారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. బసీర్హాట్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ ప్రసంగిస్తూ.. 2011లోమమతా బెనర్జీ అధికారంలోకొచ్చిన తర్వాత ఆమెను రాష్ట్రానికి కొత్త వెలుగుగా ప్రజలంతా భావించారన్నారు. కానీ ఆమె అవినీతి, అరాచకత్వంతో పాలించారని పేర్కొన్నారు.
మమత హయాంను 'లెప్ట్ కన్నా చీకటి పాలన ' గా మోదీ అభివర్ణించారు. గతంలోకాంగ్రెస్, లెప్ట్ పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.అధికార పార్టీలు అరాచక పాలన కొనసాగించడం బెంగాల్లో రాజకీయ సంస్రృతిగా మారిందన్నారు. అభివృద్ధి సాధించేందుకు రాజకీయాలు చేయాలని కోరారు. అభివృద్ధి ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని స్సష్టం చేశారు. మమత బెనర్జీ పరివర్తన్(మార్పు) తెస్తానని అధికారంలోకి వచ్చారన్నారు. కానీ అధికారంలోకొచ్చిన తర్వాత ఆమే మారిపోయి అవినీతి పాలనను కొనసాగించారని అన్నారు. వివేకానంద ప్లై ఓవర్ కుప్ప కూలడం, శారదా స్కామ్, నారదా టేప్ లు మెరుస్తున్న ఆమె పాలనను చూపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
Mamata benarji, PM Modi, Bengal polls, comments,మమతా బెనర్జీ, నరేంద్రమోదీ, బెంగాల్ ఎలక్షన్,
Advertisement