CCA
-
‘మమతా కంటే.. లెఫ్ట్ పార్టీల పాలన మేలు’
కోల్‌కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ మమతా బెనర్జీ పాలన కంటే గతంలో పాలించిన కమ్యూనిస్టు పార్టీల పాలనే బాగుండేదని ఎద్దేవా చేశారు. మంగవారం కోల్‌కతాలో బీజేపీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తృణమూళ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. బెంగాల్లో మమతా పాలనలో అక్రమ వలసలు, గోవుల ఆక్రమ రవాణా పెరిగిపోయని మండిపడ్డారు. బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మమతా బెనర్జీ ఆగడాలకు స్వస్తి పలుకుతామని అన్నారు. దీదీ పాలన కంటే 34 ఏళ్లు పాలించిన కమ్యూనిస్టుల పాలన బాగుండేదని అమిత్ షా అన్నారు. ఇదే విషయాన్ని బెంగాల్ ప్రజలు సైతం అనుకుంటున్నారని తెలిపారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడం బీజేపీ నిబద్దతకు నిదర్శనమని తెలిపారు. ఎట్టిపరిస్థిల్లో సీఏఏను అమలు చేసి తీరుతామని తెలిపారు. బెంగాల్ మమతా బెనర్జీ సీఏఏ విషయంలో ప్రజలను మరింత గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు-2019.. పాకిస్తాన్, బంగ్లాదేశ్,ఆఫ్గానిస్తాన్ల్లో మతపరమైన వేధింపులు ఎందుర్కొని భారత్‌కు వచ్చే ముస్లియేతరలకు భారత పౌరసత్వం కల్పించనున్న విషయం తెలిసిందే. -
ఆరుగురు పాక్ వలసదారులకు భారత పౌరసత్వం
భోపాల్: పాకిస్తాన్ నుంచి మధ్యప్రదేశ్‌కి వచ్చిన ఆరుగురు పాక్ శరణార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని అందించింది. వీరు మధ్యప్రదేశ్‌లో దశాబ్దాల కాలంగా జీవిస్తున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద భారత్ పౌరసత్వం కల్పించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్ర మాట్లాడుతూ.. ఈ ఆరుగురు వలస బాధితులు మతపరమైన హింసకు గురై భారత్‌లో బతకడానికి వచ్చారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం వారి భారత పౌరసత్వ పత్రాలను అధికారికంగా అందించినట్లు మంత్రి నరోత్తం మిశ్ర తెలిపారు. పౌరసత్వం పొందిన ఆరుగురిలో నందలాల్, అమిత్ కుమార్ భోపాల్ నివాసితులు కాగా, అర్జున్‌దాస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ్ దాస్, సౌశల్య బాయి మాండ్‌సౌర్‌కు చెందినవారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు భారత దేశ పౌరసత్వం కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. 31 ఏళ్లుగా తాను అటు పాకిస్తాన్, ఇటు భారత్‌కు చెందిన వాడని కాదనే భావన ఉండేది. కానీ, ప్రస్తుతం తాను భారతీయుడనని గర్వంగా ఉన్నట్లు అర్జున్‌దాస్ మంచందాని మీడియాతో తెలిపాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వీరు 1988-2005 సమయంలో భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వారికి పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం అందిచామని అధికారులు తెలిపారు. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురయ్యే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్షీ, క్రైస్తవ వలసదారులకు భారత్ పౌరసత్వం కల్పించనుంది. అయితే 2014 సంవత్సరం కంటే ముందే భారత్‌కు వచ్చివారికి మాత్రమే దేశ పౌరసత్వం కల్పించనుంది. -
సీఏఏపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: మమతా బెనర్జీ
కోల్‌కతా : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పేర్కొన్నారు. కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. కాగా తమ రాష్ట్రంలో కూడా త్వరలో సీఏఏ, ఎన్ఆర్సీలపై వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేస్తామని ఆమె వెల్లడించారు. సీఏఏ ఇప్పుడు బిల్లు కాదని, చట్టమని.. కావున దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అంశాలపై చర్చించడానికి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతారా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మమతా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాలపై చర్చించడానికి ఆసక్తి చూపిస్తే తప్పకుండా కోల్‌కతాలో సమావేశం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఎన్పీఆర్లో చాలా అంశాలు ఎన్ఆర్సీకి అనుకూలంగా ముడిపడి ఉన్నాయని.. ఎన్పీఆర్పై నిర్ణయం తీసుకునే ముందు ఈశాన్య రాష్ట్రల ముఖ్యమంత్రులు ఎన్పీఆర్ను క్షుణంగా పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మమతా జవవరి 24 వరకు సీఏఏకు వ్యతిరేకంగా డార్జిలింగ్‌లో చేపట్టనున్న పలు ర్యాలీల్లో పాల్గొననున్నారు. -
మాకు ఈ ఖర్మేంటి?!
సాక్షి, అమరావతి: బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వాణిజ్య శాఖ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. గతేడాది జీఎస్టీ అమలుకు ఇబ్బందులొస్తాయని భావించిన ప్రభుత్వం వీరి బదిలీలను నిలిపివేసింది. ఈ ఏడాదైనా బదిలీలు చేస్తారు కదా అని ఎదురుచూస్తున్న వారు.. సాధారణ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా పరిమితులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పరస్పర అంగీకారం, రిక్వెస్ట్ బదీలకు మాత్రమే అనుమతిస్తూ జీవో ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ! వాణిజ్య శాఖలో 557 గెజిటెడ్ ఆఫీసర్లు, 102 సర్కిల్స్‌లోని సిబ్బందిలో 80 శాతం మందికిపైగా ఉద్యోగులు అయిదేళ్లు దాటినా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇలా ఒకే వ్యక్తి ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తే డీలర్లతో పరిచయాలు పెరిగి అది వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖర్చులు టీఏ, డీఏ ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటు పిల్లల చదువుల పరంగా, ఇటు ఆర్థికంగా నష్టపోతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగ సంఘం చెబుతోంది. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి బదిలీ అయి, పిల్లల చదువుల కోసం చాలామంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కానీ గడిచిన నాలుగేళ్లుగా 20 శాతానికి మించి ఉద్యోగులకు బదిలీలు చేయకపోవడం, గతేడాది అసలు పూర్తిగా లేకపోవడంతో వీరు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు ఎక్కువని, అలాగే అమరావతి పరిధిలో పనిచేసే వారికి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) అదనంగా లభిస్తుందని.. అయితే గ్రామీణ ప్రాంతంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు. ఆర్థిక మంత్రిని కలుస్తాం.. వాణిజ్య శాఖలో సాధారణ బదిలీలకు అనుమతించాలని త్వరలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆల్ ఇండియా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ బదిలీలకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి
న్యూఢిల్లీ: ఇతర బ్యాంకులతో ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి భాగ స్వామ్య విషయమై ఏజెన్సీ బ్యాంకులను నియంత్రించడమనే నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒకసారి పునఃపరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. ప్రభుత్వ చర్యతో కంపెనీలకు సమస్యలు ఉత్పన్నం కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐబీఏ.. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ (సీసీఏ), సీబీడీటీలకు ఒక లేఖ రాసింది. నాన్-ఏజెన్సీ బ్యాంకులు పన్ను చెల్లింపుల సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించేందుకు ఏజెన్సీ బ్యాంకుల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవడం లేదని ఐబీఏ తెలిపింది. పన్నుల సేకరణ కు ప్రభుత్వం నుంచి అనుమతి పొందినవే ఏజెన్సీ బ్యాంకులు. -
గూగుల్ అనుకొని...
‘యాడ్గూగుల్’ను హ్యాక్ చేసిన ఐసిస్ లండన్: దిగ్గజ సెర్చింజన్ గూగుల్‌ను నేలకు దించుతామని ప్రతిన బూనిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ పొరపాటున ఆపేరుతో ఉన్న ఒక చిన్న భారతీయ కంపెనీని హ్యాక్ చేసింది. మీడియా కథనాల ప్రకారం ఐఎస్ఐఎస్ అనుబంధ హ్యాకింగ్ గ్రూప్ సైబర్ కాలిఫేట్ ఆర్మీ (సీసీఏ) భారత్‌కు చెందిన గాందాని కె అనే వ్యక్తి పేరుమీద రిజిస్టరైన యాడ్గూగుల్ఆన్లైన్.కామ్ అనే సంస్థను హ్యాక్ చేసింది. ఈ సంస్థ స్థానిక కంపెనీలకు సెర్చింజన్ సేవలు అందిస్తోంది. ‘మేము సోమవారం గూగుల్‌ని హ్యాక్ చేస్తామని ప్రకటించాం. భగవంతుని దయవల్ల అది ఈ రోజే జరగొచ్చు’ అని సీసీఏ గురువారం ప్రకటించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే యాడ్గూగుల్ఆన్లైన్.కామ్ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. హ్యాకింగ్‌కు గురైన తరువాత వెబ్సైట్లో ఇస్లామిక్‌స్టేట్‌కు సంబంధించిన పాట ఫ్రెంచ్‌లో వినిపించడంతో పాటు ఐఎస్ లోగో కనిపించింది. సీసీఏ హ్యాక్ చేసినట్లు వెబ్సైట్లో ఇండికేషన్ వచ్చింది. ఇది జరిగిన కొద్ది సేపటికే మరో హ్యాకింగ్ గ్రూప్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఐఎస్ మెస్సేజ్‌ను చెరిపేసింది. యూకే మీడియా కథనం ప్రకారం ఇప్పటి వరకు 35 బ్రిటిష్ వెబ్సైట్లను ఐఎస్ హ్యాక్ చేసింది.