
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనా మా చేసినట్లు చెప్పారు. రాజకీయాలు తనకు ఇష్టం లేని అంశమని చెప్పారు. జాదవ్‌పూర్ నుంచి మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికైన మిమి గురువారం టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు.
ఈ నెల 13వ తేదీనే పదవికి రాజీనామా లేఖను పంపినట్లు అనంతరం తెలిపారు. తనకు రాజకీయాలు పడవని అనుభవం ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. అయితే, రాజీనామాను సీఎం మమత అంగీకరించిందీ లేనిదీ మిమి తెలుపలేదు. టీఎంసీ అంగీకరించాక నిబంధనల మేరకు లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖను అందజేస్తానన్నారు. మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుంది.