Jadavpur
-
టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనా మా చేసినట్లు చెప్పారు. రాజకీయాలు తనకు ఇష్టం లేని అంశమని చెప్పారు. జాదవ్‌పూర్ నుంచి మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికైన మిమి గురువారం టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. ఈ నెల 13వ తేదీనే పదవికి రాజీనామా లేఖను పంపినట్లు అనంతరం తెలిపారు. తనకు రాజకీయాలు పడవని అనుభవం ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. అయితే, రాజీనామాను సీఎం మమత అంగీకరించిందీ లేనిదీ మిమి తెలుపలేదు. టీఎంసీ అంగీకరించాక నిబంధనల మేరకు లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖను అందజేస్తానన్నారు. మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుంది. -
అధికార పార్టీ అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్.. రచ్చ
కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి మంగళవారం లోక్‌సభలో ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గమైన జాధవ్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తలు బుధవారం ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ రచ్చగా మారింది. డ్యాన్స్‌లో భాగంగా యువతి అసభ్యకరమైన దుస్తులను వేసుకొని అదే పనిగా అక్కడి యువకులను రెచ్చగెట్టే రీతిలో ప్రదర్శన చేయడం వివాదాస్పదమైంది. ఓ అధికార పార్టీ అత్యంత అసభ్యకరంగా, అశ్లీలంగా రికార్డ్ డ్యాన్స్ ప్రదర్శన నిర్వహించడంపై ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓ మహిళా ఎంపీని అభినందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో రికార్డు డ్యాన్స్‌ల పేరిట అశ్లీల నృత్యాలు చేయిస్తారా? అని మండిపడుతున్నాయి. ఆశించినరీతిలో లోక్‌సభ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడా వేడుకలు చేయొద్దని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ టీఎంసీ కార్యకర్తలను ఆదేశించారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఈ అశ్లీల నృత్య ప్రదర్శనను నిర్వహించడం గమనార్హం. ఈ వేడుకలో అత్యధిక సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలే పాల్గొన్నారు. ఈ మొత్తం వీడియోనూ ఫోన్లలో రికార్డు చేసిన కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. బీజేపీ నాయకుడు సునీప్దాస్ ఈ వీడియోపై స్పందిస్తూ..' ఇందులో నాకు కొత్తగా ఏమి కన్పించడం లేదు. టీఎంసీలో ముందు నుంచే ఈ కల్చర్ అంతర్భాగంగా ఉంద’ని విమర్శించారు. మమతాబెనర్జీకి తెలియకుండా టీఎంసీ కార్యకర్తలు ఏ పని చేయరని, ఇప్పటికైనా ఈ సంఘటనపై మిమి చక్రవర్తి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎన్నికల ప్రచారంలో ‘ది గ్రేట్ ఖలీ’
కోల్కత్తా: దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తమ సహచరులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరికొందరు ప్రచారంలో పాల్గొనక పోయిన సోషల్ మీడియా వారికి విషేస్ తెలియజేస్తున్నారు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ కూడా తన స్నేహితుని కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన అనుపమ్ హజ్రాకు మద్దతుగా ఖలీ ప్రచారంలో పాల్గొన్నారు. ‘నా స్నేహితుడు ఎన్నికల బరిలో నిలువడంతో అతనికి మద్దతు తెలుపడానికి అమెరికా నుంచి వచ్చాను. అతనికి ఓటు వేసి ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం కల్పించండి. మోదీ మంచి ప్రధాని. దేశం కోసం ఆయన ఎంతో చేశారు. ఆయనను చూసి నేను గర్వపడుతున్నాన’ని ఖలీ తెలిపారు. అయితే తను ఏ పార్టీకి మద్దతు తెలుపడం లేదని.. కేవలం తన స్నేహితుని కోసమే ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అనుపమ్ మాట్లాడుతూ.. ఖలీ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. తమ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఖలీ తొలిసారిగా ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. ఖలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో.. అతన్ని చూడటానికి జనాలు భారీగా తరలివచ్చారు. అతనితో కరచాలనం చేయడానికి, సెల్పీలు తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. కాగా, అనుపమ్ 2014లో బోల్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డరానే కారణంతో టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ ఏడాది జనవరిలో అనుపమ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అనుపమ్ మార్చిలో బీజేపీలో చేరారు. అయితే అనుపమ్‌కు పోటీగా టీఎంసీ ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తిని బరిలో నిలిపింది. -
యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
నగరంలో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి రుద్రనారాయణ శర్మను ఈ రోజు తెల్లవారుజామున జాదవ్పూర్లోని గాంధీ కాలనీలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. జాదవ్‌పూర్ ప్రాంతంలో గత రాత్రి రోడ్డు పక్కన తన స్నేహితుడితో నిల్చోని ఉన్న యువతి పట్ల శర్మ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కేసు నమోదు చేసి, నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితునికి సంబంధించిన గుర్తులను యువతి పోలీసులకు వివరించింది. దాంతో పోలీసులు నిందితుడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.