కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి మంగళవారం లోక్‌సభలో ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గమైన జాధవ్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తలు బుధవారం ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ రచ్చగా మారింది. డ్యాన్స్‌లో భాగంగా యువతి అసభ్యకరమైన దుస్తులను వేసుకొని అదే పనిగా అక్కడి యువకులను రెచ్చగెట్టే రీతిలో ప్రదర్శన చేయడం వివాదాస్పదమైంది. ఓ అధికార పార్టీ అత్యంత అసభ్యకరంగా, అశ్లీలంగా రికార్డ్ డ్యాన్స్ ప్రదర్శన నిర్వహించడంపై ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓ మహిళా ఎంపీని అభినందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో రికార్డు డ్యాన్స్‌ల పేరిట అశ్లీల నృత్యాలు చేయిస్తారా? అని మండిపడుతున్నాయి.
ఆశించినరీతిలో లోక్‌సభ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడా వేడుకలు చేయొద్దని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ టీఎంసీ కార్యకర్తలను ఆదేశించారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఈ అశ్లీల నృత్య ప్రదర్శనను నిర్వహించడం గమనార్హం. ఈ వేడుకలో అత్యధిక సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలే పాల్గొన్నారు. ఈ మొత్తం వీడియోనూ ఫోన్లలో రికార్డు చేసిన కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
బీజేపీ నాయకుడు సునీప్‌దాస్ ఈ వీడియోపై స్పందిస్తూ..' ఇందులో నాకు కొత్తగా ఏమి కన్పించడం లేదు. టీఎంసీలో ముందు నుంచే ఈ కల్చర్ అంతర్భాగంగా ఉంద’ని విమర్శించారు. మమతాబెనర్జీకి తెలియకుండా టీఎంసీ కార్యకర్తలు ఏ పని చేయరని, ఇప్పటికైనా ఈ సంఘటనపై మిమి చక్రవర్తి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment