
రామ్ జఠ్మలానీ
ఇండోర్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలో మూడో కూటమి రావాలని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ ఆదివారం పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘మోదీ బహిష్కరణ’కు ఇది అవసరమని ఆయన సూచించారు. జర్మనీ సహా ఇతర దేశాల్లోని నల్ల ధనాన్ని తిరిగి తీసుకురావడంలో బీజేపీ, కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ‘‘రెండూ పార్టీలు ప్రజలను మోసగించాయి. ఇలాంటి సమయంలో నిష్పక్షపాతంగా పనిచేసే మూడో కూటమి అవసరం ఉంది. మమత మూడో కూటమి నాయకత్వం వహించాలని కోరుతున్నా’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment