third frant
-
ఫ్రంట్ పేరు చెబితే ఉలుకెందుకు?
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితో టీఆర్ఎస్ నేతలు జరిపిన చర్చలను వక్రీకరించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ రాద్దాంతానికి తెర లేపారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటేనే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవించిందని అన్నారు. శనివారం ఒంగోలు నగరంలోని 43వ డివిజన్లో జరిగిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ జగన్మోహన్రెడ్డిని కలిసినప్పటి నుంచి చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో లేని టీఆర్ఎస్తో వైఎస్సార్ సీపీ పొత్తులు పెట్టుకుందని ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్టానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా టీఆర్ఎస్ కలిసి వస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసి ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి జరిగిన చర్చలను చంద్రబాబు వక్రీకరించి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాపీల బాబును ప్రజలు నమ్మరు.. ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుకనే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచారన్నారు. నిజంగా పేదలపై అంత ప్రేమ ఉంటే నాలుగేళ్ల నుంచి పింఛన్ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కాపీల బాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే పింఛన్ రూ.2 వేలకు పెంచారన్నారు. ఎన్నికల్లో ఎక్కడ వెనుకబడిపోతామోనన్న భయంతో హడావుడిగా పెంచిన పింఛన్ అమలుకు పూనుకున్నారన్నారు. ఆటో, ట్రాక్టర్లకు పన్నుల రద్దు జగన్ ప్రకటించిన నవరత్నాల్లోనివేనని ప్రస్తావించారు. చంద్రబాబు ఇంకా రైతుబంధు పథకం కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారన్నారు. కనీసం ఎన్నికల సమీపంలోనైనా ప్రజలకు కొంత మేలు జరుగుతుందంటే అది ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చలవేనన్నారు. చంద్రబాబు ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజలు అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు మానసికంగా సిద్ధమయ్యారన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లల్లో తెలుగుదేశం చేసిన అభివృద్ధి లేకపోగా ప్రజాధనాన్ని వాటాలు వేసుకొని లూఠీ చేశారని విమర్శించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో చంద్రబాబు ఉలికిపాటుకు గురవుతున్నారని, జగన్‌కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఉద్వేగానికి లోనవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
‘మమత ఆధ్వర్యంలో మూడో కూటమి’
ఇండోర్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలో మూడో కూటమి రావాలని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ ఆదివారం పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘మోదీ బహిష్కరణ’కు ఇది అవసరమని ఆయన సూచించారు. జర్మనీ సహా ఇతర దేశాల్లోని నల్ల ధనాన్ని తిరిగి తీసుకురావడంలో బీజేపీ, కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ‘‘రెండూ పార్టీలు ప్రజలను మోసగించాయి. ఇలాంటి సమయంలో నిష్పక్షపాతంగా పనిచేసే మూడో కూటమి అవసరం ఉంది. మమత మూడో కూటమి నాయకత్వం వహించాలని కోరుతున్నా’’అని అన్నారు. -
మహారాష్ట్రలో మూడో ఫ్రంట్?
సాక్షి, ముంబై: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో తృతీయ కూటమిని ఏర్పరిచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీల కూటములు ఉండగా, వీటికి ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, ఓబీసీలు, ప్రోగ్రెసివ్, దళిత, ముస్లిం పార్టీలన్నీ కలసి మూడో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు, ‘బీఆర్పీ బహుజన్ మహాసంఘ్’ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ మూడో కూటమికి నేతృత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమా–కోరేగావ్ ఘటనలో దళితులపై దాడులను ఖండిస్తూ ప్రకాశ్ అంబేడ్కర్ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమవడం తెలిసిందే. ఈ బంద్‌తో ఆయన తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడంతోపాటు దళితులను ఏకతాటిపైకి తీసుకురావడంలో çసఫలమయ్యారని చెప్పవచ్చు. తమ ఆలోచనలను, ప్రణాళికలను అమలు చేయాలంటే అధికారంలోకి రావాలనీ, అందుకోసం బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేయడమే మార్గమని వామపక్షాలు, ఓబీసీలు, ప్రగతిశీల (ప్రోగ్రెసివ్), దళిత, ముస్లిం, సంభాజీ బ్రిగేడ్ మొదలైన వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలిసింది. -
నేటినుంచి అధిక ధరలపై పోరు
దోమలగూడ,న్యూస్‌లైన్: రానున్న ఎన్నికల్లో ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, అది కూడా లెఫ్ట్ పార్టీల నాయకత్వంలో రావాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీఎంపీ అబనీరాయ్, రాష్ట్రకార్యదర్శి జానకిరాములు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ హోటల్లో ఈనెల 11,12,13 తేదీల్లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశ వివరాలను బుధవారం దోమలగూడ ఎస్ఎంఎస్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని, కాంగ్రెస్, బీజేపీలను పక్కకు పెట్టడడమే ఇందుకు నిదర్శనమన్నారు. వామపక్షాలు కూడా ప్రజాసమస్యలపై నిత్యం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రజామద్దతు అనుకున్నంత కూడగట్ట లేకపోతున్నామని, దీనిపై ఆలోచన చేయాల్సిన ఆవశ్యత ఉందన్నారు. ధరల పెరుగుదలపై ఈనెల 16 నుంచి 31 వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాష్ట్రం విడిపోకూడదనేదే తమ పార్టీ విధానమని, అదే క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నట్లు వారు చెప్పారు. పార్టీ యువజన విభాగమైన ఆర్వైఎఫ్ జాతీయ మహాసభలు మార్చి 2 నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
దేశానికి మూడో ఫ్రంట్ అవసరం..
మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : యూపీఏ, ఎన్డీయే పని తీరును ప్రజలు చూశారని, ఈ నేపథ్యంలో దేశానికి మూ డో ఫ్రంట్ అవసరం ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. యూపీఏ కంటే మోడీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆరోపించారు. మంచిర్యాలలో ఆదివారం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ని చూసి యూపీఏ, మోడీని చూసి బీజేపీ మురిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. మూడో ఫ్రంట్ వారిని దె బ్బతీయం ఖాయమన్నారు. తెలంగాణకు సీపీఐ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో చంద్రబాబు ఆ పార్టీ నేతల ఆశలను అడియాసలు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో పెదపల్లి, ఖమ్మం, నల్లగొండ, ఆంధ్రలో అనంతపురం, విజయవాడ పార్లమెంటు స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ నాటకాల మాదిరిగా మారిందన్నారు. రాబోయే ఎ న్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఓడడం ఖాయమన్నారు. సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు సీతారామయ్య, కలవే ని శంకర్, లింగమూర్తి, కారుకూరి నగేష్, పానుగంటి భానుదాస్, గోపు సారయ్య, ఖలీందర్‌ఖాన్ పాల్గొన్నారు.