మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : యూపీఏ, ఎన్డీయే పని తీరును ప్రజలు చూశారని, ఈ నేపథ్యంలో దేశానికి మూ డో ఫ్రంట్ అవసరం ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. యూపీఏ కంటే మోడీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆరోపించారు. మంచిర్యాలలో ఆదివారం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ని చూసి యూపీఏ, మోడీని చూసి బీజేపీ మురిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. మూడో ఫ్రంట్ వారిని దె బ్బతీయం ఖాయమన్నారు.
తెలంగాణకు సీపీఐ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో చంద్రబాబు ఆ పార్టీ నేతల ఆశలను అడియాసలు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో పెదపల్లి, ఖమ్మం, నల్లగొండ, ఆంధ్రలో అనంతపురం, విజయవాడ పార్లమెంటు స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ నాటకాల మాదిరిగా మారిందన్నారు. రాబోయే ఎ న్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఓడడం ఖాయమన్నారు. సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు సీతారామయ్య, కలవే ని శంకర్, లింగమూర్తి, కారుకూరి నగేష్, పానుగంటి భానుదాస్, గోపు సారయ్య, ఖలీందర్‌ఖాన్ పాల్గొన్నారు.
దేశానికి మూడో ఫ్రంట్ అవసరం..
Published Mon, Jan 13 2014 6:06 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement