ఆరో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ విడత ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ఒకరిపై మరొకరు ఆధిక్యం సాధించడానికి మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ మరీ ఓటర్లను ఆకర్షించడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం మరో దశ ఎన్నికలు మాత్రమే ఉండడంతో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఇతర ప్రధాన పార్టీలూ అన్ని అస్త్ర శస్త్రాలను బయటకు తీశాయి. ఈసారి ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి.
మోదీ రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతిపరుడని ఆరోపించడం, 1984 సిక్కు అల్లర్లను ప్రస్తావించడంతో ప్రచారం హద్దులు మీరింది. నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న మోదీ, అమిత్ షాలు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రచారం నిర్వహించారు. ఈసారి బరిలో ఎందరో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలుగా మారిన క్రీడాకారులు, నటులు, గాయకులు, వారసులు, కోట్లకు పడగలెత్తిన వాళ్లు, నేరచరితులు ఇలా ఎందరో ఉన్నారు. ధనబలం, కండబలం ఉన్నవారిదే ఎన్నికల్లో పై చేయి అని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment