Personal criticism
-
అప్పుడు పొగిడిన మీడియానే... నన్నిప్పుడు తిడుతోంది: రాహుల్
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు. రాజస్తాన్‌లోకి జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు. -
‘నా ఇమేజ్ దెబ్బ తీసేందుకు వేల కోట్లు ఖర్చు!’
ఇండోర్: తనపై జరిగే వ్యక్తిగత దాడులు.. తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నాయనే విషయాన్ని చెప్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో పేరిట యాత్ర కొనసాగిస్తున్న ఆయన.. ఇండోర్(మధ్యప్రదేశ్‌లో) మీడియాతో మాట్లాడారు. నా ఇమేజ్ను దెబ్బ తీసేందుకు బీజేపీ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వాళ్లు నా గురించి ఒక నిర్దిష్ట చిత్రాన్ని సృష్టించారు. కానీ, ప్రజలు ఇది హానికరం అని అనుకుంటారు. ఏది ఏమైనా నిజం నా వెంటే ఉంది. కాబట్టి, ఇది(వాళ్లు చేసేది) నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. నాపై వ్యక్తిగత దాడులు నేను సరైన దిశలో వెళ్తున్నానని చెబుతున్నాయి అని పేర్కొన్నారాయన. అమేథీలో మళ్లీ పోటీ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా భారత్ జోడో యాత్ర మీదే ఉందని, ఏడాది లేదంటే ఏడాదిన్నర తర్వాత అమేథీ పోటీ అంశం గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాహుల్‌కు చేదు అనుభవం ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఇండోర్‌లో పాదయాత్ర చేపట్టిన సమయంలో ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు వినిపించాయి. దారి పక్కన నిల్చున్న కొందరు జై శ్రీరామ్‌తో పాటు మోదీ, మోదీ నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. Rahul Gandhi’s Bharat Jodo Yatra welcomed in Indore by chants of Jai Shri Ram and slogans of Modi Modi… pic.twitter.com/uXlfksUIYa — Dharmendra Chhonkar (@yoursdharm) November 28, 2022 #WATCH | Congress MP Rahul Gandhi rides a bicycle during the 'Bharat Jodo Yatra' in Indore, Madhya Pradesh. (Source: AICC) pic.twitter.com/SdXjvMqRuX — ANI (@ANI) November 28, 2022 ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఇండోర్ బడా గణపతి స్క్వేర్ నుంచి సోమవారం ఉదయం ఆయన యాత్ర ప్రారంభించారు. హుషారుగా సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆ సమయంలో ఆయనపై పూల వర్షం కురిపించారు కార్యకర్తలు. ఆదివారం యాత్రలో ఆయన బుల్లెట్ బైక్ నడుపుతూ కనిపించిన విషయం తెలిసిందే. 👇 కాంగ్రెస్‌కు వాళ్లంటే గౌరవమే లేదు: మోదీ -
రంగస్థలంలో హేమాహేమీలు
ఆరో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ విడత ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ఒకరిపై మరొకరు ఆధిక్యం సాధించడానికి మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ మరీ ఓటర్లను ఆకర్షించడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం మరో దశ ఎన్నికలు మాత్రమే ఉండడంతో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఇతర ప్రధాన పార్టీలూ అన్ని అస్త్ర శస్త్రాలను బయటకు తీశాయి. ఈసారి ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీ రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతిపరుడని ఆరోపించడం, 1984 సిక్కు అల్లర్లను ప్రస్తావించడంతో ప్రచారం హద్దులు మీరింది. నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న మోదీ, అమిత్ షాలు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రచారం నిర్వహించారు. ఈసారి బరిలో ఎందరో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలుగా మారిన క్రీడాకారులు, నటులు, గాయకులు, వారసులు, కోట్లకు పడగలెత్తిన వాళ్లు, నేరచరితులు ఇలా ఎందరో ఉన్నారు. ధనబలం, కండబలం ఉన్నవారిదే ఎన్నికల్లో పై చేయి అని స్పష్టంగా తెలుస్తోంది. -
మాట తూటా
ఠారెత్తిస్తున్న ఎండలకి జనం మాడు పగులుతూ ఉంటే, ఎండ వేడితో పోటీ పడుతూ రాజకీయ నేతలు నిప్పు కణికల్లా విసురుతున్న మాటలతో ఎవరికి మూడుతుందో అర్థం కావడం లేదు. మరో రెండు దశల్లో ఎన్నికలు ముగుస్తాయనగా మన నేతాశ్రీలు మరుగున పడిన కుంభకోణాలను, నేతల పాత చరిత్రను తవ్వి తీస్తున్నారు. వాటినే ఎన్నికల అస్త్రాలుగా మలచుకొని గురి పెట్టి కొడుతున్నారు. ప్రధానిని కాపాలదారుడే దొంగ అని రాహుల్ గాంధీ అన్న దగ్గర్నుంచి ఇప్పుడు నరేంద్ర మోదీ హఠాత్తుగా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని భ్రష్టాచారి నం.1 అనడంతో రాజకీయ ప్రచార వేడి రికార్డు స్థాయికి చేరుకుంది. నరేంద్ర మోదీ బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రచారం బోనులోకి తీసుకువస్తే, ఫైర్ బ్రాండ్ మమతా దీదీ, గోధ్రా మత ఘర్షణల్ని ప్రస్తావిస్తూ నిప్పులు చెరుగుతున్నారు. తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్న టైపులో నేతలందరూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మీ తండ్రిని (రాజీవ్‌గాంధీ) ఆయన భజనపరులు మిస్టర్ క్లీన్ అని కీర్తిస్తున్నారు కానీ, రాజీవ్ మరణించేనాటికి నం 1 భ్రష్టాచారి (అత్యంత అవినీతి పరుడు) అని పేరు తెచ్చుకున్నారు’ – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మోదీజీ యుద్ధం ముగిసిపోయింది. మీ ఖర్మ ఎలా ఉందో త్వరలో తేలిపోతుంది. మా తండ్రిపై మీరు చేసిన వ్యాఖ్యలతో మీ అంతరంగం తేటతెల్లమైంది. ఇక మిమ్మల్ని ఏవీ కాపాడలేవు. నేను మాత్రం మీకు ప్రేమతో ఓ పేద్ద కౌగిలింత ఇవ్వగలను. – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోదీకి ఉన్నంత అహంకారం మరెవరికీ ఉండదు. మహాభారతంలో దుర్యోధనుడు పాత్రకి అంతటి అహం ఉంది. అలాంటి అహంకారుల్ని దేశ ప్రజలు సహించరు. దీనికి దుర్యోధనుడి జీవితమే నిలువెత్తు నిదర్శనం. – ప్రియాంక గాంధీ , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుర్యోధనుడెవరో, అర్జునుడు ఎవరో ? తేల్చాల్సింది మీరు కాదు. దేశ ప్రజలే తేలుస్తారు. – అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నరేంద్ర మోదీని ప్రియాంక పొరపాటున దుర్యోధనుడు అన్నారు. వాస్తవానికి ఆయన ఒక తలారి (ఉరి శిక్షల్ని అమలు చేసే వ్యక్తి). ఎందరో జడ్జీలు, జర్నలిస్టుల మృతికి ప్రధానిదే బాధ్యత – రబ్రీదేవి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రైతన్నలను దోపిడీ చేసిన వ్యక్తిని ఈ చౌకీదార్ కోర్టుకు లాగాడు. ఆ వ్యక్తి ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) చుట్టూ తిరుగుతున్నాడు. బెయిల్ కోసం కోర్టుకు పోయాడు. తానేమో షెహన్షా(రారాజు) అనుకుంటాడు. ఇప్పుడు వణికిపోతున్నాడు. నేనిప్పటికే అతన్ని జైలు గుమ్మం వరకూ తీసుకువెళ్లాను. నన్ను ఆశీర్వదించండి. అతన్ని వచ్చే ఐదేళ్లలో జైలుకు పంపిస్తాను, – ప్రియాంక భర్త వాద్రాపై పరోక్షంగా మోదీ నన్ను అయిదేళ్లుగా వేధిస్తున్నారు. వివిధ విచారణ సంస్థల ద్వారా నోటీసుల మీద నోటీసులు పంపుతూ మానసికంగా వేధిస్తున్నారు. 11సార్లు నోటీసులు పంపి, ఒక్కో విడతలో 11 గంటల చొప్పున విచారించారు. అయినా ఒక్క ఆధారమూ దొరకలేదు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యల్ని గాలికి వదిలేసి మళ్లీ నా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు – రాబర్ట్ వాద్రా మమత పరిపాలనలో తృణమూల్ కాంగ్రెస్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది తృణమూల్ టోలాబాజీ ట్యాక్స్ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు – మోదీ నేను బలవంతంగా వసూళ్లు చేస్తే, మీరెవరు. మీ తల నుంచి కాళ్ల వరకు ప్రజల రక్తంతో తడిసిపోయింది కదా. ఎప్పుడు చూసినా అ ల్లర్లు, అల్లర్లు, అల్లర్లు. మోదీ ఒక అబద్ధాల కోరు, రావణ, ఎక్సపైరీ పీఎం (ఆయన ప్రధాని పదవి ఎక్స్పైర్ అయిందన్న అర్థంలో) – మమతా బెనర్జీ ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం గుజరాత్ అల్లర్లు జరిగాయి. వాటిని ఇప్పుడు ప్రస్తావించడం ఏమిటి ? దాని వల్ల రాజకీయంగా తృణమూల్‌కు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది‘‘ – దిలీప్ ఘోష్, బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మోదీ భక్తులు తమ పిల్లలకి ఇంక ఇలాంటి రైమ్స్ నేర్పించాలి. మోదీ మోదీ యస్ పాపా, అభివృద్ధి జరిగిందా నో పాపా, రైతులు ఆనందంగా ఉన్నారా, నో పాపా, 10 కోట్ల ఉద్యోగాలు నో పాపా, అన్నీ కబుర్లే హహహ – తేజస్వి యాదవ్, ఆర్జేడీ నేత -
వ్యక్తిగత విమర్శలకు దిగిన టిడిపి సభ్యులు
హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వ పనితీరుని వైఎస్ఆర్సీఎల్పి నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టడంతో టీడీపి సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారు. హుద్‌హుద్ తుపాను సహాయక చర్యలకు సంబంధించి వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు వ్యక్తిగత విమర్శలు చేశారు. కోర్టు పరిధిలోని అంశాలను సభలో లేవనెత్తారు. దాంతో వైఎస్ఆర్ సీపి సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండతారన్న భయంతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇరుపార్టీల సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు, రవికుమార్‌లు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపి సభ్యులు తీవ్రనిరసన తెలిపారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పరిశీలించి తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. సభ్యుల వాదోపవాదాల మధ్య సభను వాయిదా వేశారు.