ఇండోర్: తనపై జరిగే వ్యక్తిగత దాడులు.. తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నాయనే విషయాన్ని చెప్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో పేరిట యాత్ర కొనసాగిస్తున్న ఆయన.. ఇండోర్(మధ్యప్రదేశ్‌లో) మీడియాతో మాట్లాడారు.
నా ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వాళ్లు నా గురించి ఒక నిర్దిష్ట చిత్రాన్ని సృష్టించారు. కానీ, ప్రజలు ఇది హానికరం అని అనుకుంటారు. ఏది ఏమైనా నిజం నా వెంటే ఉంది. కాబట్టి, ఇది(వాళ్లు చేసేది) నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. నాపై వ్యక్తిగత దాడులు నేను సరైన దిశలో వెళ్తున్నానని చెబుతున్నాయి అని పేర్కొన్నారాయన.
అమేథీలో మళ్లీ పోటీ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా భారత్ జోడో యాత్ర మీదే ఉందని, ఏడాది లేదంటే ఏడాదిన్నర తర్వాత అమేథీ పోటీ అంశం గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.
రాహుల్‌కు చేదు అనుభవం
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఇండోర్‌లో పాదయాత్ర చేపట్టిన సమయంలో ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు వినిపించాయి. దారి పక్కన నిల్చున్న కొందరు జై శ్రీరామ్‌తో పాటు మోదీ, మోదీ నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Rahul Gandhi’s Bharat Jodo Yatra welcomed in Indore by chants of Jai Shri Ram and slogans of Modi Modi… pic.twitter.com/uXlfksUIYa
— Dharmendra Chhonkar (@yoursdharm) November 28, 2022
#WATCH | Congress MP Rahul Gandhi rides a bicycle during the 'Bharat Jodo Yatra' in Indore, Madhya Pradesh.
— ANI (@ANI) November 28, 2022
(Source: AICC) pic.twitter.com/SdXjvMqRuX
ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఇండోర్ బడా గణపతి స్క్వేర్ నుంచి సోమవారం ఉదయం ఆయన యాత్ర ప్రారంభించారు. హుషారుగా సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆ సమయంలో ఆయనపై పూల వర్షం కురిపించారు కార్యకర్తలు. ఆదివారం యాత్రలో ఆయన బుల్లెట్ బైక్ నడుపుతూ కనిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment