కోల్‌కతా : కేంద్ర బృందాలు జరిపిన దర్యాప్తుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అధికార పార్టీ టీఎంసీ అవినీతి చేసిందంటూ ప్రధాని మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి జిల్లా మొయినాగురిలో దీదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో అవినీతి ఆరోపణలంటూ రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు కేంద్రం 300 కేంద్ర బృందాలను పంపింది. కానీ వారు ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేదని దుయ్యబట్టారు.
ఉపాధి హామి నిధులు ఏమయ్యాయి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపై ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలు ఉపాధి హామీ పథకం కింద పనిచేశారు. కానీ డబ్బులు చెల్లించ లేదని.. ఆ పథకం నిధులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.
బీజేపీ అంటే ‘బెంగాలీ వ్యతిరేక పార్టీ’
బీజేపీ ‘బెంగాలీ వ్యతిరేక పార్టీ’ అని అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) ముసుగులో గిరిజనులు, దళితులు, ఓబీసలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు .బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అనుమతించబోమని ఆమె తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీతో పోరాడుతున్నది టీఎంసీ మాత్రమేనన్న మమతా.. సీపీఎం, కాంగ్రెస్‌లు మాత్రం కమలం గెలుపు కోసం కలిసి పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌ని కాపాడాలంటే టీఎంసీ గెలవాలని సీఎం మమతా బెనర్జీ ఓటర్లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment