100 రోజులకు బ్లూ ప్రింట్‌ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు | Blue Print For First 100 Days Says Pm Modi Of Third Term | Sakshi
Sakshi News home page

100 రోజులకు బ్లూ ప్రింట్‌ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, May 15 2024 6:39 PM | Last Updated on Wed, May 15 2024 7:36 PM

Blue Print For First 100 Days Says Pm Modi Of Third Term

అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని అనే అంశంపై తాను ఇప్పటికే బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసుకున్నట్లు ప్రధాని మోదీ అన్నారు

మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజులకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దేశం కోసం తన 100 రోజుల ప్రణాళిక దాదాపుగా పూర్తయిందని, నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి జాప్యం ఉండదని, బ్లూప్రింట్‌కు అనుగుణంగా జూన్ 4 తర్వాత వెంటనే పనులు ప్రారంభిస్తానని ప్రధాని ప్రకటించారు.

జూన్ 4 తర్వాత చేసే పని బ్లూప్రింట్‌తో మేం ముందుకు రానున్నాం.  ప్రజలు ఈ బ్లూ ప్రింట్‌పై నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది నా కాన్ఫిడెన్స్‌ కాదని, ప్రజల నుండి నేను పొందుతున్న ఆశీర్వాదం నాకు భరోసా ఇస్తుంది అని అన్నారు.  

100 రోజుల ప్రణాళిక కోసం తాను యువతను స్ఫూర్తిగా తీసుకున్నానని ప్రధాని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో నేను కలిసిన యువత నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు.  ఓ 25 రోజులు వారి కోసం కేటాయిస్తున్నాను. నా దేశం యువత తమ మనస్సులో ఏ ఆలోచనలు వచ్చినా నాకు పంపాలని నేను కోరుకుంటున్నాను అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement