లోక్‌సభ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్4 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం డూబ్లికేట్ ఎన్సీపీ, డూబ్లికేట్ శివసేన తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.
నార్త్ మహరాష్ట్ర నందూర్బర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై సెటైర్లు వేశారు.
ఓ పెద్దాయన
40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు.
నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో
నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్‌లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్ పవర్, ఎక్‌నాథ్ షిండ్‌తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.
ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు
ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్ పవార్ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్‌లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment