నగరంలోని ఓ హోర్డింగ్ పైకి ఎక్కి ఇద్దరు తెలంగాణ జేఏసీ నాయకులు హల్ చల్ చేశారు.
హైదరాబాద్ : నగరంలోని ఓ హోర్డింగ్ పైకి ఎక్కి ఇద్దరు విద్యార్థి జేఏసీ నాయకులు హల్ చల్ చేశారు. చింతల విజయ్ రాజు, ఆనంద్ అనే ఇద్దరు జేఏసీ నేతలు శుక్రవారం ఉదయం కోఠి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా లోని హోర్టింగ్ పైకి ఎక్కారు. 'గత ప్రభుత్వం ఏపీఐఐసీ పేరిట సంస్థను ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించింది. పెట్టుబడి దారీ వ్యవస్థను అడ్డంపెట్టుకుని తెలంగాణ భూములను దోచుకున్నారు. పరిశ్రమల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి' అని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వారిని హోర్టింగ్ నుంచి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు.