
ప్రతీకాత్మక చిత్రం
నొయిడా, ఉత్తరప్రదేశ్: యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల బాలికపై ఓ మైనర్ అత్యాచార యత్నం చేశాడు. ఆపై నిజం బయట పడుతుందని ఆ చిన్నారిని హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని బిస్‌రఖ్ ప్రాంతంలో గల దేవాలయం సమీపంలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నొయిడాలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి పక్కింట్లో నివాసముండే 13 ఏళ్ల మైనర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.
చిన్నారి ఆచూకీ తెలియక సతమతమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం లభించింది. శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం నిందితుడు బాలికను తీసుకొని వెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. మైనర్‌ను విచారించగా నిజం ఒప్పు కున్నాడనీ, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద పోర్న్ చిత్రాలు లభించాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment