Greater Noida city
-
మహిళ హత్య; 18వ అంతస్తు నుంచి కిందకు..
నోయిడా: మహిళను హత్య చేసి ఆపై దాన్ని ఆత్మహత్యలా సృష్టించాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. అయితే పోలీసుల ముందు అతని వేషాలు ఎక్కువ సేపు నిలబడలేక పోయాయి. దర్యాప్తులో నిందితుడి బండారం అంతా బయటపడింది. అనుమానాస్పద రీతిలో గుర్తు తెలియని మహిళ మరణించినట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఏవీజే హైట్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఓ వ్యక్తి హత్యకు పూనుకొని అనంతరం ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని 18వ అంతస్తు నుంచి కిందకు తోసి ఆత్మహత్యలా చిత్రీకరించాలనుకున్నాడు. కాగా ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని, ఆదివారం ఉదయం మహిళ మృతదేహాన్నిఅపార్ట్మెంట్ సెక్యూరిటీ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అదే భవనంలో ఉన్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానించిన పోలీసులు.. నిందితుడు సదరు అపార్టుమెంట్లోనే 18వ అంతస్తులో నివసిస్తున్న ముంతాజ్ ఖాన్‌గా గుర్తించారు. అంతేగాక ప్రమాదం చోటుచేసుకున్నప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుడు ముంతాజ్.. మహిళను రెండు, మూడు రోజుల క్రితమే ఫ్లాట్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే ముంతాజ్ బిహార్ రాష్ట్రానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇతని బంధువులు కూడా అదే అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్ లో నివసిస్తున్నారని, వారిని సైతం ప్రశ్నిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
దారుణం: చిన్నారిపై మైనర్ అకృత్యం, హత్య
నొయిడా, ఉత్తరప్రదేశ్: యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల బాలికపై ఓ మైనర్ అత్యాచార యత్నం చేశాడు. ఆపై నిజం బయట పడుతుందని ఆ చిన్నారిని హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని బిస్రఖ్ ప్రాంతంలో గల దేవాలయం సమీపంలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నొయిడాలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి పక్కింట్లో నివాసముండే 13 ఏళ్ల మైనర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారి ఆచూకీ తెలియక సతమతమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం లభించింది. శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం నిందితుడు బాలికను తీసుకొని వెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. మైనర్‌ను విచారించగా నిజం ఒప్పు కున్నాడనీ, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద పోర్న్ చిత్రాలు లభించాయని తెలిపారు. -
కుక్క మాంసం వండలేదని చిత్రహింసలు..
లక్నో: ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా నగరంలోని గామా 1 సెక్టర్లో మై స్పైస్ కేఫ్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. కుక్క మాంసాన్ని వండేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారులను హోటల్ యజమాని అవినాశ్ కుమార్ చిత్ర హింసలకు గురి చేశాడు. దాంతో స్థానికులు గురువారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్‌పై దాడి చేసి... ఐదు కుక్కలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు చిన్నారులను చిల్డ్రన్స్ హోమ్‌కు తరలించారు. ఈ చిన్నారులు మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల వారని... వారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మై స్సైస్ కేఫ్ హోటల్లో చిన్నారులు పని చేస్తున్నారు. వారిపై తరచుగా అవినాష్ దాడి చేసేవాడు. దాంతో వారు బిగ్గరగా ఏడుస్తుంటే హోటల్ ఎదురుగా ఉన్న ప్రవీణ్ బట్టి అనే వ్యక్తి అవినాష్‌ను ప్రశ్నిస్తే... ఏవేవో కథలు చెప్పేవాడు. అయితే గురువారం ఆర్థరాత్రి చిన్నారులు బిగ్గరగా ఏడవడంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్‌పై దాడి చేసి పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుక్క మాంసం వండకపోతే అవినాష్ తమను బండబూతులు తిడుతూ.... విపరీతంగా కొట్టేవాడని.. కరెంట్ షాక్ ఇస్తానని తరచు బెదిరించేవాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల శరీరంపై గాయాలను కూడా పోలీసులు గుర్తించారు. హోటల్ మరో భాగస్వామి ముఖేష్ రాజ్‌పుత్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ చిన్నారులను జార్ఖండ్‌లో ఎనిమిది నెలల కిత్రం కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ నుంచి ఐదు కుక్కలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానికంగా నైజీరియన్లు నివసిస్తున్నారు. వారికోసం కుక్క మాంసం వండిస్తున్నట్లు విచారణలో అవినాశ్ చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.