మైనర్‌పై మూడు నెలలుగా అత్యాచారం
యువకుడి అరెస్ట్
బంజారాహిల్స్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. ఆపై బ్లాక్‌మెయిల్ చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడో ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నార్సింగ్‌లో నివసించే గుంటి మహేశ్ (25) ఆటో డ్రైవర్. ఫిలింనగర్ జ్ఞానిజైల్‌సింగ్ నగర్‌బస్తీకి చెందిన మైనర్(17)ను ఏడాది క్రితం నుంచి ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నార్సింగ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
ఆపై తన మాట వినకుంటే విషయాన్ని అందరికి చెబుతానని బ్లాక్‌మెయిల్ చేస్తూ మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాధిత బాలిక తన తల్లికి విషయాన్ని తెలపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిందితుడికి పెళ్లయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో నయవంచన
Published Tue, Feb 24 2015 12:18 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement