జైపూర్: రాజస్థాన్ అల్వార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 8 మంది యువకులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలి నుంచి రూ.50వేలు వసూలు చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 1న ప్రధాన నిందితుడు సోహిల్ తనకు సోదరి వరసయ్యే బాలికకు ఫోన్ చేసి ఓ చోటుకు రమ్మన్నాడు. అక్కడకి రాకపోతే సీక్రెట్‌గా తీసిన ప్రైవేటు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయంతో అక్కడకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెపై సోహిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని ఫోన్లో చిత్రీకరించారు.
ఆ తర్వాత నుంచి బాధితురాలిని తరచూ బ్లాక్ చేసి డబ్బు వసూలు చేశాడు సోహిల్. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఓసారి బాలిక డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
చదవండి: భార్యపై అనుమానం.. బెడ్‌రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!
Comments
Please login to add a commentAdd a comment