మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బుల్దాన జిల్లా హివర్‌ఖేడాలోని ఆశ్రమ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.జిల్లా ఎస్పీ సంజయ్ బావిష్కర్ ఈ ఘటన వివరాలను వెల్లడిస్తూ.. నినాదీ ఆశ్రమ పాఠశాలలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జరిగినట్లు తెలిపారు. పాఠశాల ప్రెసిడెంట్, సెక్రెటరి, జాయింట్ సెక్రటరితో పాటు పలువురు సిబ్బంది ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారని.. వీరిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కేసు విచారణ కోసం మహారాష్ట్ర డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటుచేశారు.