
మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం
ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది.
చీరాల(ప్రకాశం):
ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని చీరాల జవహర్‌నగర్‌కు చెందిన ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు లైంగికదాడికి ఒడిగట్టాడు. కాలనీకి చెందిన బాలుడు(17) ఇంటి పక్కనే ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని(13)తో చనువుగా ఉండేవాడు.
ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.