బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి.. | Minor from Uttarakhand tortured as sex slave in Bengaluru | Sakshi
Sakshi News home page

బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..

Published Thu, May 28 2015 11:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..

బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..

బెంగళూరు:  పొట్టకూటి కోసం  వెళ్లిన 16 ఏళ్ల బాలికను  లైంగిక బానిసగా మార్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. తన వ్యాపార భాగస్వామి ఇంట్లో  బేబీ సిట్టర్గా పని చేస్తున్న ఆమెపై  పది నెలల పాటు  లైంగికంగా దాడిచేసి అమానుషంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. ఈ విషయం బయటపెడితే పేస్తానని బెదిరించి సుమారు ఏడాది పాటు ఆ బాలికకు  నరకాన్ని చూపించాడు.  సహనం నశించిన ఆ బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు అందించిన వివరాల  ప్రకారం ఉత్తరాఖండ్కు చెందిన ముగ్గురు సభ్యుల పేద కుటుంబాన్ని.. ఓ మహిళా  వ్యాపారవేత్త 2014  ఏప్రిల్లో  బెంగళూరుకు తీసుకొచ్చింది.  ఫ్యాషన్ బిజినెస్ నడిపే ఆమె తన పిల్లలను  చూసుకునేందుకు బాలికను  పనిలో పెట్టుకోగా,  తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులుగా  పని చేసుకుంటున్నారు.   

వ్యాపార పనుల్లో భాగంగా  ఆ మహిళా వ్యాపారవేత్త బెలగావ్కి మారుతూ తనతోపాటు ఆ బాలికను కూడా తీసుకెళ్లింది.  అయితే ఆ మహిళకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న సుఖవిందర్ సింగ్ ... బాలికపై కన్నేశాడు. వ్యాపార భాగస్వామి ఇంట్లో  లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు.  అలా పది నెలలపాటు తన దురాగతాన్ని కొనసాగించాడు.   

ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.   అతని హింసను  తట్టుకోలేని ఆ బాలిక  తనను ఇంటికి పంపించెయ్యమని చాలాసార్లు యజమానికి మొరపెట్టుకుంది. అయినా ఆమె పట్టించుకోలేదు.  పైగా  పిచ్చి పిచ్చి కథలు అల్లుతున్నావని మండిపడింది. అంతేకాకుండా దొంగతనం కేసు పెట్టి ఇరికిస్తానని బెదిరించింది. దీంతో ఎలాగోలా ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు  చెప్పడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.

బాలికను వేధిస్తున్న ఘటన తమ దృష్టికి రావడంతో బెలగావిలోని  ఇంటిపై దాడిచేసి ఆమెను రక్షించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై  ఐపీసీ5 (L) , పోస్కో  చట్టం 376 లోని  6  తదితర సెక్షన్ల కింద నమోదు చేసినట్లు చెప్పారు. బాలికను  వైద్య పరీక్షలకు పంపించామని, ప్రాథమిక దర్యాప్తు అనంతరం  బెలగావి పోలీసులకు కేసును బదిలీ  చేస్తామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement