Sukhwinder Singh
-
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
1.52లక్షల ఉద్యోగాలు ఇచ్చాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 24 వేల ఉద్యోగాలిస్తే...ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొమ్మిదేళ్ల పాలనలో 1.52 లక్షల ఉద్యోగాలిచ్చామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని జడ్చర్ల బీజేపీ సభలో హిమాచల్ సీఎం సుక్విందర్‌సింగ్ సుక్కు అబద్ధాలు మాట్లాడటం సరికాదని..ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని హరీశ్‌రావు హితవు పలికారు. జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రిని శనివారం ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రసంగించారు. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలోకి వలసలు వచ్చి బతుకుతున్నారని, ఎంతోమందికి తెలంగాణ జీవనోపాధిగా మారిందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో దేశంలోనే వలసలకు, కరువు కాటకాలకు నిలయంగా మారిన పాలమూరు నేడు పచ్చబడి పసిడి పంటలతో అలరారుతోందన్నారు. రేపో మాపో ‘పాలమూరు’నీళ్లు వచ్చి జడ్చర్లను ముద్దాడబోతున్నాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు వాటిని 55కు పెంచామని వెల్లడించారు. తెలంగాణలో మొట్టమొదటి మెడికల్ కాలేజీ పాలమూరుకు వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్వీందర్ సింగ్ సుఖ్
-
హిమాచల్ సీఎంగా సుఖు
సిమ్లా/కలబుర్గి (కర్ణాటక): హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్సింగ్ సుఖును కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. గత అసెంబ్లీలో విపక్ష నేతగా కొనసాగిన ముకేశ్ అగ్నిహోత్రి (60) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తీవ్ర మల్లగుల్లాలు, గత 24 గంటల్లో ఏకంగా రెండుసార్లు కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ తదితరాల అనంతరం అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకునిగా వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగెల్, భూపీందర్‌సింగ్ హుడా, రాజీవ్ శుక్లా శనివారం సీఎల్పీ తాజా భేటీ అనంతరం మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఆయనతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రా తదితరులు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించడం తెలిసిందే. గురువారం ఫలితాలు వెలువడ్డప్పటి నుంచే సీఎం పదవి కోసం కాంగ్రెస్ నేతల్లో తీవ్ర పోరు నెలకొంది. మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య, పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ తదితర ఆశావహులంతా విఫలయత్నం చేశారు. 58 ఏళ్ల సుఖు తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీకి సారథ్యం వహించారు. దిగువ హిమాచల్ ప్రాంతం నుంచి సీఎం అవుతున్న తొలి కాంగ్రెస్ నేత ఆయనే. సుఖ్వీందర్ సీఎం కానున్నట్టు తెలియగానే హమీర్పూర్ జిల్లాలోని సొంతూరు నదౌన్‌లో, అక్కడి ఆయన నివాసంలో సంబరాలు మొదలయ్యాయి. హిమాచలే ఆదర్శం: ఖర్గే కలబుర్గి: హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను వచ్చే ఏడాది కర్నాటకలో పునరావృతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే పిలుపునిచ్చారు. 10 సూత్రాల ప్రణాళిక ద్వారా మనం హిమాచల్‌లో మంచి మెజారిటీతో నెగ్గామని చెప్పుకొచ్చారు. కౌన్సిలర్ నుంచి సీఎం వరకు.. అంచెలంచెలుగా ఎదిగిన పోరాట యోధుడు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నాయకుడి నుంచి ముఖ్య మంత్రి వరకు సుఖ్విందర్ సుఖు అంచెలంచెలుగా ఎదిగారు. సిమ్లాలో వార్డు కౌన్సిలర్, యువజన విభాగం అధ్యక్షుడు, హమీర్పూర్ జిల్లా నాదౌన్ ఎమ్మెల్యే, తర్వాత పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు సీఎం.. ఇలా అన్ని స్థాయిల్లో పదవుల్ని చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యంత చరిష్మా ఉన్న దివంగత సీఎం వీరభద్రసింగ్ ప్రత్యర్థిగా ఉంటూనే పార్టీలో స్వయంశక్తితో ఎదిగారు. ఈ ఎన్నికల్లో పార్టీ ప్రచార కమిటీకి నేతృత్వం వహించి విజయతీరాలకు చేర్చారు. నాదోన్ నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ అగ్నిహోత్రికి మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి హేమాహేమీల ప్రచారాన్ని తట్టుకుని మరీ గెలిచారు. 1964 మార్చి 27న నాదోన్‌లో సాధారణ కుటుంబంలో సుఖు జన్మించారు. తండ్రి రషీల్ సింగ్ రాష్ట్ర రవాణా కార్పొరేషన్లో డ్రైవర్. విద్యార్థిగా ఫీజుల కోసం సిమ్లాలో పాలమ్మేవారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాక కాంగ్రెస్‌లో చేరారు. 1989 నుంచి ఆరేళ్ల పాటు విద్యార్థి నేతగా చురుగ్గా ఉన్నారు. 1998 నుంచి పదేళ్లు ఎన్ఎస్యూఐ రాష్ట్ర చీఫ్‌గా చేశారు. 1992, 1997ల్లో సిమ్లా కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా నెగ్గారు. 2003లో నాదౌన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీపై ఆయనకున్న పట్టు, కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించిన అధిష్టానం 2013లో పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఆరేళ్లపాటు పీసీసీ చీఫ్‌గా ముఠా సంస్కృతిని ప్రోత్సహించకుండా కార్యకర్తలతో, నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడని పేరుంతివే ఆయన్ను సీఎం పీఠానికి దగ్గర చేశాయి. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్‌ను కాదని మరీ 25 మంది ఎమ్మెల్యేలు సుఖుకే మద్దతు పలికారంటే ఆయనకున్న మంచిపేరే కారణం. అందుకే అధిష్టానం సుఖు నాయకత్వ సామర్థ్యానికే ఓటేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిమాచల్ ముఖ్యమంత్రిపై సస్పెన్స్ కు తెర
-
వీడిన ఉత్కంఠ.. హిమాచల్ సీఎం ఎవరో తేల్చేసిన అధిష్టానం
హిమాచల్‌లో ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే చర్చ జోరుగా సాగింది. సీఎం పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేయడంతో ఒకరిని ఎంపిక చేయడం పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. తాజాగా హిమాచల్‌లో ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానించిన సంగతి తెలిసిందే. దీంతో హిమాచల్ సీఎంగా సీనియర్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పదవిని ఆశిస్తున్న ఇతర నేతలతో చర్చించిన తర్వాత ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన సీఎం డిసెంబర్ 11 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై సుఖ్వీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకమాండ్ నిర్ణయం గురించి తనకు తెలియదని అన్నారు. సాయంత్రం జరిగే కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ సమావేశానికి వెళుతున్నానని చెప్పారు. కాగా గురువారం వెల్లడైన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. బీజేపీకి 25 స్థానాలు దక్కించుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. చదవండి: ఆ ట్వీట్ గురించి కాదు..తృణమాల్ నేత బీజేపీపై ఫైర్ -
రాజీవ్ విగ్రహానికి అవమానం
లూథియానా/చండీగఢ్: లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి మంగళవారం ఇద్దరు స్థానిక యువకులు రంగు పులమడం సంచలనమైంది. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు వెంటనే రంగంలోకి దిగి విగ్రహాన్ని శుభ్రపరిచారు. 1984 నాటి సిక్కు అల్లర్ల ఘటనకు సంబంధించి రాజీవ్ గాంధీపై ఆరోపణలు ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్ విగ్రహాలను తొలగించడంతో పాటుగా భారత ప్రభుత్వం ఆయనకిచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని ఆ యువకులు డిమాండ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది శిరోమణి అకాలీదళ్ పార్టీ పనే. దీనికి ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్వీర్ సింగ్ బాదల్ క్షమాపణ చెప్పాలి. అకాలీదళ్ ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే వచ్చే లోక్‌సభలో ఆ పార్టీకి తగిన ప్రజలు బుద్ధి చెబుతారు. ఆ అల్లర్లకు గాంధీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబానికి చెందిన వారి పేర్లను బలవంతంగా అందులో ఇరికించారు’ అని అన్నారు. -
‘నన్ను అద్వానీలా చూడకండి’
సిమ్లా : బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలా తనను చూడొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత మొదటిసారి పార్టీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్‌తో కలిసి పాల్గొన్నారు. సిమ్లాలో శనివారం నిర్వహించిన సమావేశంలో వీరభద్ర సింగ్ మాట్లాడుతూ..‘అద్వానీలా కేవలం పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వడానికే లేను. ప్రజల్లోకి వెళ్లడానికి ఇప్పటికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లగలను. వయసు రిత్యా కొందరూ నన్ను అద్వానీ, మురళీమనోహర్ జోషిలా కేవలం మార్గదర్శకుడిలా మాత్రమే చూస్తున్నారు. వారి కలలను ఎప్పటికీ సకారం చేసుకోలేకపోయారు. త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యువకుడిలా పార్టీకి సేవచేస్తా’ అని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరభద్రసింగ్‌కు, పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. సరైన అభ్యర్థులకు సీట్లు కేటాయించకపోవడం మూలంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, కొంత మంది అసమర్థ నేతల వల్ల పార్టీకి నష్టం జరిగిందని వీరభద్ర సింగ్ అన్నారు. రాష్ట్రంలో నూతన విద్యాసంస్థలు, ఆసుపత్రులు నిర్మించడంలో విఫలమైయ్యామని ఓటమికి అది కూడా కారణమని సుఖ్వీందర్ సింగ్ పేర్కొన్నారు. -
సిగరెట్ అమ్మలేదన్న కోపంతో భారతీయుడిని..
కాలిఫోర్నియా: సిగరెట్ అమ్మడానికి నిరాకరించిన కారణంగా భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత వారం రోజుల్లో ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులు హత్యకు గురయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పంజాబ్ లోని కపుర్తలా సిటీకి చెందిన జగ్జీత్ సింగ్ 18 నెలల కిందట అమెరికాకు వెళ్లాడు. తన అక్కాబావల ఇంట్లో ఉంటూ స్థానిక స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తుండేవాడు. స్టోర్‌కు వచ్చిన ఓ వ్యక్తి జాతి విద్వేష వ్యాఖ్యలతో పాటు జగ్జీత్పై వ్యక్తిగత దూషణకు దిగాడు. ఐడీ ఉంటే చూపించు అంటూ కాలిఫోర్నియా వ్యక్తి జగ్జీత్ను అడిగాడని మరో క్లర్క్ సుఖ్వీందర్ తెలిపారు. జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో గుర్తుతెలియని వ్యక్తికి జగ్జీత్ సిగరెట్ అమ్మడానికి నిరాకరించాడు. ఐడీ విషయంపై ఇద్దరిమధ్య వాగ్వివాదం జరిగింది. కొంతసేపటికి ఆ వ్యక్తి తీవ్ర పదజాలంతో దూషిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దాదాపు అరగంట తర్వాత కత్తితో పరుగున వచ్చిన ఆ వ్యక్తి జగ్జీత్పై విచక్షణారహితంగా దాడిచేశాడు. క్షణాల్లోనే జగ్జీత్ రక్తపుమడుగులో పడిఉన్నాని సుఖ్వీందర్ తెలిపాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేకపోయిందని, జగ్జీత్ చనిపోయాడని వివరించాడు. జాతి విద్వేషం కారణంగానే జగ్జీత్ బలైపోయాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. జగ్జీత్ చాలా మంచివాడని, ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదని మోనికా రోడ్రిగేజ్ అనే వర్కర్ విచారం వ్యక్తం చేసింది. -
పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతా: టాప్ సింగర్
ముంబై: ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని ప్రముఖ గాయకుడు సుఖ్విందర్ సింగ్ వెల్లడించాడు. ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని ‘హిందుస్తాన్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించాడు. ‘ దయచేసి ఎవరో ఒకరు నన్ను పెళ్లిచేసుకోండి. లేకపోతే నుయ్యిలోకి దూకి చచ్చిపోతాన’ని అన్నాడు. తాను తొందరగా పెళ్లి చేసుకోవాలని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కోరుతున్నాడని వెల్లడించాడు. 2013లో పెళ్లి చేసుకుంటానని సుఖ్విందర్ గతంలో చెప్పాడు. ‘ప్రేమ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ప్రేమ అనేది దేవుడు ఇచ్చిన కానుక. ఇప్పటికే ఒకరిని ప్రేమిస్తున్నా. కొన్ని రోజుల తర్వాత ఆమె పేరు వెల్లడిస్తాన’ని పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు పెళ్లి మాట ఎత్తలేదు. 45 ఏళ్ల సుఖ్విర్.. ‘ఛయ్య.. ఛయ్య, జైహో’ పాటలతో పాటు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. -
బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..
బెంగళూరు: పొట్టకూటి కోసం వెళ్లిన 16 ఏళ్ల బాలికను లైంగిక బానిసగా మార్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వ్యాపార భాగస్వామి ఇంట్లో బేబీ సిట్టర్‌గా పని చేస్తున్న ఆమెపై పది నెలల పాటు లైంగికంగా దాడిచేసి అమానుషంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. ఈ విషయం బయటపెడితే పేస్తానని బెదిరించి సుమారు ఏడాది పాటు ఆ బాలికకు నరకాన్ని చూపించాడు. సహనం నశించిన ఆ బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల పేద కుటుంబాన్ని.. ఓ మహిళా వ్యాపారవేత్త 2014 ఏప్రిల్‌లో బెంగళూరుకు తీసుకొచ్చింది. ఫ్యాషన్ బిజినెస్ నడిపే ఆమె తన పిల్లలను చూసుకునేందుకు బాలికను పనిలో పెట్టుకోగా, తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులుగా పని చేసుకుంటున్నారు. వ్యాపార పనుల్లో భాగంగా ఆ మహిళా వ్యాపారవేత్త బెలగావ్కి మారుతూ తనతోపాటు ఆ బాలికను కూడా తీసుకెళ్లింది. అయితే ఆ మహిళకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న సుఖవిందర్ సింగ్ ... బాలికపై కన్నేశాడు. వ్యాపార భాగస్వామి ఇంట్లో లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా పది నెలలపాటు తన దురాగతాన్ని కొనసాగించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అతని హింసను తట్టుకోలేని ఆ బాలిక తనను ఇంటికి పంపించెయ్యమని చాలాసార్లు యజమానికి మొరపెట్టుకుంది. అయినా ఆమె పట్టించుకోలేదు. పైగా పిచ్చి పిచ్చి కథలు అల్లుతున్నావని మండిపడింది. అంతేకాకుండా దొంగతనం కేసు పెట్టి ఇరికిస్తానని బెదిరించింది. దీంతో ఎలాగోలా ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. బాలికను వేధిస్తున్న ఘటన తమ దృష్టికి రావడంతో బెలగావిలోని ఇంటిపై దాడిచేసి ఆమెను రక్షించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై ఐపీసీ5 (L) , పోస్కో చట్టం 376 లోని 6 తదితర సెక్షన్ల కింద నమోదు చేసినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, ప్రాథమిక దర్యాప్తు అనంతరం బెలగావి పోలీసులకు కేసును బదిలీ చేస్తామని తెలిపారు. -
శృతి హసన్ తో కపిల్ శర్మ
'కామెడీ నైట్స్ విత్ కపిల్' టెలివిజన్ షో తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కపిల్ శర్మ బాలీవుడ్ తార శృతి హసన్, గాయకుడు సుఖ్విందర్ సింగ్ తో ఓ పాటలో కనిపించనున్నారు. ఈ పాటను కోక్ స్టూడియోస్ రూపొందించనున్నారు. నటుడిగానే కాకుండా.. గాయకుడిగా మారడానికి ప్రయత్రాల్ని ముమ్మరం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఓ ఫ్లైట్ లో శృతిని కలిసాను. ఫ్లైట్ లో శృతితో కలిసి ప్రయాణం చేశాను. సంగీతంపై ఇద్దరి అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి. అప్పుడే ఓ పాటను కలిసి పాడాలని డిసైడ్ అయ్యాం. శృతి తండ్రి కమల్ హసన్ అంటే నాకు చాలా ఇష్టం అని కపిల్ తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న 'బ్యాంక్ చోర్' అనే చిత్రంలో కపిల్ నటిస్తున్నారు.