శృతి హసన్ తో కపిల్ శర్మ
శృతి హసన్ తో కపిల్ శర్మ
Published Wed, Mar 5 2014 3:17 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
'కామెడీ నైట్స్ విత్ కపిల్' టెలివిజన్ షో తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కపిల్ శర్మ బాలీవుడ్ తార శృతి హసన్, గాయకుడు సుఖ్విందర్ సింగ్ తో ఓ పాటలో కనిపించనున్నారు. ఈ పాటను కోక్ స్టూడియోస్ రూపొందించనున్నారు.
నటుడిగానే కాకుండా.. గాయకుడిగా మారడానికి ప్రయత్రాల్ని ముమ్మరం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఓ ఫ్లైట్ లో శృతిని కలిసాను. ఫ్లైట్ లో శృతితో కలిసి ప్రయాణం చేశాను. సంగీతంపై ఇద్దరి అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి. అప్పుడే ఓ పాటను కలిసి పాడాలని డిసైడ్ అయ్యాం. శృతి తండ్రి కమల్ హసన్ అంటే నాకు చాలా ఇష్టం అని కపిల్ తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న 'బ్యాంక్ చోర్' అనే చిత్రంలో కపిల్ నటిస్తున్నారు.
Advertisement
Advertisement