పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతా: టాప్ సింగర్ | Sukhwinder Singh will either get married this year or kill himself | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతా: టాప్ సింగర్

Published Wed, Mar 22 2017 10:22 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతా: టాప్ సింగర్

పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతా: టాప్ సింగర్

ముంబై: ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని ప్రముఖ గాయకుడు సుఖ్విందర్ సింగ్ వెల్లడించాడు. ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని ‘హిందుస్తాన్ టైమ్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించాడు. ‘ దయచేసి ఎవరో ఒకరు నన్ను పెళ్లిచేసుకోండి. లేకపోతే నుయ్యిలోకి దూకి చచ్చిపోతాన’ని అన్నాడు. తాను తొందరగా పెళ్లి చేసుకోవాలని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కోరుతున్నాడని వెల్లడించాడు.

2013లో పెళ్లి చేసుకుంటానని సుఖ్విందర్ గతంలో చెప్పాడు. ‘ప్రేమ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ప్రేమ అనేది దేవుడు ఇచ్చిన కానుక. ఇప్పటికే ఒకరిని ప్రేమిస్తున్నా. కొన్ని రోజుల తర్వాత ఆమె పేరు వెల్లడిస్తాన’ని పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు పెళ్లి మాట ఎత్తలేదు. 45 ఏళ్ల సుఖ్విర్.. ‘ఛయ్య.. ఛయ్య, జైహో’ పాటలతో పాటు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement