గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది.
ఈపూరు (గుంటూరు) : బాలికపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోడేపుడివారిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన బాలిక (16) వినుకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15 న పాఠశాల నుంచి బస్సులో తిరిగి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు పుస్తకాలు కొనిస్తానని బైక్ పై తీసుకెళ్లాడు.అతని మాటలు నమ్మిన విద్యార్థిని బైక్ ఎక్కింది.
ఆ తర్వాత అతను వాహనాన్ని ఎక్కడా ఆపకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో తన ఇద్దరు మిత్రులు గోపి, మరియబాబులను కూడా తీసుకొని వెళ్లాడు. అటవీ ప్రాంతంలో బాలిక పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆమెను తీసుకొచ్చి బస్టాండ్‌లో వదిలేశాడు. ఈ విషయాన్ని బాలిక గుంటూరులో ఉండే తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదివారం రాత్రి ఈపూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.