
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు : యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లాలోని నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. నల్లచెరువుకు చెందిన యువతిని కిడ్నాప్ చేసిన రఫీ అనే ఆటో డ్రైవర్ స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. కీచకుల బారినుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతినిల ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment