తొలిసారిగా ఓ మైనర్కు కారుణ్యమరణం!
తొలిసారిగా ఓ మైనర్కు కారుణ్యమరణం!
Published Sat, Sep 17 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
బ్రస్సెల్స్: ఎప్పటికీ నయం కాని రోగాల బారిన పడినవారు ప్రభుత్వ అనుమతితో కారుణ్యమరణం(యుథనేషియా) పొందుతారు. చాలా దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానంలో కేవలం పెద్దవారికి మాత్రమే ప్రభుత్వాలు కారుణ్యమరణానికి అనుమతిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ మైనర్కు కారుణ్యమరణానికి అవకాశం కల్పించింది బెల్జియం. మైనర్కు సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికీ.. ప్రత్యేకమైన కేసుగా పరిగణించి ఓ మైనర్కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు ఫెడరల్ యుథనేషియా అధికారి ఒకరు వెల్లడించారు.
బెల్జియంలో కారుణ్యమరణానికి సంబంధించిన చట్టాన్ని 2014లో మార్చారు. దీని ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా కారుణ్యమరణానికి అనుమతించొచ్చు. ఈ చట్టం ప్రకారం మైనర్కు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. నెదర్లండ్స్లో సైతం మైనర్లకు కారుణ్యమరణానికి అనుమతి ఉన్నప్పటికీ.. 12 సంవత్సరాలు పైబడినవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాగా.. మొదటిసారిగా బెల్జియం ఓ మైనర్కు కారుణ్యమరణానికి అనుమతించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ప్రత్యేకమైన కేసుగా భావించడంలో పరిగణలోకి తీసుకునే అంశాలేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Advertisement
Advertisement