మైనర్‌పై 59 ఏళ వ్యక్తి అఘాయిత్యం | 59 Year Old Man Molestation On Minor Girl | Sakshi
Sakshi News home page

మైనర్‌పై 59 ఏళ వ్యక్తి అఘాయిత్యం

Apr 27 2022 8:13 AM | Updated on Apr 27 2022 9:54 AM

59 Year Old Man Molestation On Minor Girl - Sakshi

శివాజీనగర: సీఎం సొంతూరిలో దారుణం జరిగింది. 59 ఏళ్ల వ్యక్తి 11 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హావేరి శిగ్గాంవి తాలూకా బంకాపుర వద్ద జరిగింది. నిందితుడు నాగప్ప బాడదను బంకాపుర పోలీసులు మంగళవారం పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు.

ఈతకు వెళ్లి ఇద్దరు బాలికల మృతి
రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా మీర్జాపూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇందు (14), సుజాత (13) సోమవారం సాయంత్రం రాజోలుబండ కాలువలో ఈతకు దిగి నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోవడంతోనే నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం గ్రామీణ ఎమ్మెల్యే బసవనగౌడ మృతుల కుటుంబాలను పరామర్శించి రూ. 20 వేలు పరిహారం అందించారు.

(చదవండి: కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement