నీ న్యూడ్‌ ఫొటోలు పంపు.. లేకపోతే.. | Instagram Friend Blackmails Minor For Her Absence Photos In Bengaluru | Sakshi
Sakshi News home page

నీ న్యూడ్‌ ఫొటోలు పంపు.. లేకపోతే..

Published Mon, Feb 8 2021 6:01 PM | Last Updated on Mon, Feb 8 2021 9:59 PM

Instagram Friend Blackmails Minor For Her Absence Photos In Bengaluru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని అగ్రహార దసరహల్లి ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు గత జనవరి నెలలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కార్తిక్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు ఇద్దరి మధ్య చాటింగ్‌లు నడిచాయి. ఆ తర్వాతి నుంచి బాలికను న్యూడ్‌ ఫొటోలు పంపాలంటూ అతడు వేధించసాగాడు.( పోర్న్‌ రాకెట్‌: వాళ్లే ఈ నటి టార్గెట్‌!)

ఆమె స్పందించకపోయే ‘నీ న్యూడ్‌ ఫొటోలు పంపు! లేకపోతే చెయ్యి కోసుకుంటా’ అని బెదిరించసాగాడు. దీంతో భయపడిపోయిన బాలిక అతడికి తన న్యూడ్‌ ఫొటోలు కొన్ని పంపింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కార్తిక్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( నేవీ అధికారి సజీవదహనం: ఆ 6 రోజులు ఏం జరిగింది? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement