మైనర్‌పై లైంగికదాడి | Sexual assault on the minor | Sakshi
Sakshi News home page

మైనర్‌పై లైంగికదాడి

Published Sat, Jul 19 2014 1:02 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

Sexual assault  on the minor

  • నిందితుడి అరెస్ట్
  • తుర్కపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
  • తుర్కపల్లి: మైనర్‌పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తుర్కపల్లి మండలం వీరెడ్డిపల్లిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్ (17) ఈ నెల 11వ తేదీన బహిర్భూమికి వెళ్లగా అదే గ్రా మానికి చెందిన తాటికొండ నర్సింహులు  అనుసరించాడు. బాలికకు మాయమాటలు చెప్పి కరీంనగర్ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ కొండగట్టు దేవాలయం వద్ద గదిని అద్దెకు తీసుకుని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ నెల 14వ తేదీన బాలికను యాదగిరిగుట్టలో వదిలేయడంతో ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే నిందితుడు నర్సింహులును అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ  దాచేపల్లి విజయ్‌కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement