మైనర్‌పై లైంగికదాడి
నిందితుడి అరెస్ట్
తుర్కపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
తుర్కపల్లి: మైనర్‌పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తుర్కపల్లి మండలం వీరెడ్డిపల్లిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్ (17) ఈ నెల 11వ తేదీన బహిర్భూమికి వెళ్లగా అదే గ్రా మానికి చెందిన తాటికొండ నర్సింహులు అనుసరించాడు. బాలికకు మాయమాటలు చెప్పి కరీంనగర్ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ కొండగట్టు దేవాలయం వద్ద గదిని అద్దెకు తీసుకుని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ నెల 14వ తేదీన బాలికను యాదగిరిగుట్టలో వదిలేయడంతో ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే నిందితుడు నర్సింహులును అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ తెలిపారు.