ముంబై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు మైన‌ర్? | Mumbai gangrape: Birth card of accused tampered to show he's minor? | Sakshi
Sakshi News home page

ముంబై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు మైన‌ర్?

Published Sat, Aug 24 2013 7:52 PM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

గ్యాంగ్ రేప్ నిందితుల ఊహా చిత్రాలు

గ్యాంగ్ రేప్ నిందితుల ఊహా చిత్రాలు

ముంబై:  దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున ఓ మీడియా ప్రతినిధిపై జ‌రిగిన సామూహిక హ‌త్యాచారం కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురిలో ప్రధాన నిందితుడు మైనర్ అనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని నిందితుడి కుటుంబసభ్యులు మీడియా ముందు వెల్లడించారు. నిందితుడు `చాంద్ బాబు సత్తార్ షేక్ అలియాస్ మహ్మద్ అబ్దుల్` అమ్మమ్మ సర్నాబాయ్ అతడిని మైనర్ గా పేర్కొంటూ జనన ధృవీకరణ పత్రాన్ని మీడియాకు సమర్పించినట్టు తెలుస్తోంది.

అయితే జనన ధృవీకరణ పత్రంలో అతని వయసు 1997 ఫిబ్రవరి 26గా నమోదైంది. కానీ పోలీసులు మాత్రం  చాంద్ వయసు 19 ఏళ్లుగా చెబుతున్నారు. కేవలం నిందితుడిని రక్షించడానికి కుటుంబసభ్యులు తప్పుడు ధృవపత్రం సమర్పించారని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఆమె తమ మనవుడు మంచివాడని, అతనికి 16ఏళ్లే ఉంటాయని చెబుతోంది. దీనికి సంబంధించి తాను ఈ ధృవీకరణ పత్రాన్ని కోర్టులోచూపిస్తానంటోంది. జనన ధృవీకరణ పత్రాన్ని  దిద్దారన్న ఆరోపణలు వస్తున్నాయి.

కాగా, ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్‌కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై మహాలక్ష్మి, లోయర్‌పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు చాంద్ మేజర్ అత్యాచారం చేసినట్టు రుజువైతే ఏడేళ్ళ నుంచి యావజ్జీవ శిక్ష వరకు పడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement