Mumbai gangrape case
-
ముంబై 'గ్యాంగ్ రేప్' నిందితులపై మరో కేసు
ఫోటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఐదుగురు నిందితులు సాగించిన మరో అత్యాచార పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నిందితులు తనను కూడా లైంగికంగా వేధించారంటూ మరో మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఏడాది జూలైలో తనపై ఈ అకృత్యానికి పాల్పడ్డారని భన్దప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. శక్తి మిల్స్ ప్రాంగణంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. రేపిస్టులను ఆమె గుర్తించిందని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసుల ఇంటారాగేషన్లో గ్యాంగ్ నిందితులు మరిన్ని విషయాలు వెల్లడించారు. గత ఆరు నెలల కాలంలో యంగ్ జర్నలిస్టు, సెక్స్ వర్కర్, చెత్త ఏరుకునే కార్మికురాలితో సహా పలువురిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు తెలిపారు. ఆగస్టు 22న ఫోటోజర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో సలీం అన్సారీ, విజయ్ జాదవ్, మహ్మద్ ఖాసిం, హఫీజ్ షేక్, ఖాసిం బెంగాలీ, సిరాజ్ రెహమాన్ ఖాన్, మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ముంబై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు మైనర్?
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున ఓ మీడియా ప్రతినిధిపై జరిగిన సామూహిక హత్యాచారం కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురిలో ప్రధాన నిందితుడు మైనర్ అనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని నిందితుడి కుటుంబసభ్యులు మీడియా ముందు వెల్లడించారు. నిందితుడు `చాంద్ బాబు సత్తార్ షేక్ అలియాస్ మహ్మద్ అబ్దుల్` అమ్మమ్మ సర్నాబాయ్ అతడిని మైనర్ గా పేర్కొంటూ జనన ధృవీకరణ పత్రాన్ని మీడియాకు సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే జనన ధృవీకరణ పత్రంలో అతని వయసు 1997 ఫిబ్రవరి 26గా నమోదైంది. కానీ పోలీసులు మాత్రం చాంద్ వయసు 19 ఏళ్లుగా చెబుతున్నారు. కేవలం నిందితుడిని రక్షించడానికి కుటుంబసభ్యులు తప్పుడు ధృవపత్రం సమర్పించారని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఆమె తమ మనవుడు మంచివాడని, అతనికి 16ఏళ్లే ఉంటాయని చెబుతోంది. దీనికి సంబంధించి తాను ఈ ధృవీకరణ పత్రాన్ని కోర్టులోచూపిస్తానంటోంది. జనన ధృవీకరణ పత్రాన్ని దిద్దారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్‌కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై మహాలక్ష్మి, లోయర్పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు చాంద్ మేజర్ అత్యాచారం చేసినట్టు రుజువైతే ఏడేళ్ళ నుంచి యావజ్జీవ శిక్ష వరకు పడవచ్చు.