ఫోటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఐదుగురు నిందితులు సాగించిన మరో అత్యాచార పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నిందితులు తనను కూడా లైంగికంగా వేధించారంటూ మరో మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఏడాది జూలైలో తనపై ఈ అకృత్యానికి పాల్పడ్డారని భన్దప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. శక్తి మిల్స్ ప్రాంగణంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. రేపిస్టులను ఆమె గుర్తించిందని పోలీసులు తెలిపారు.
మరోవైపు పోలీసుల ఇంటారాగేషన్లో గ్యాంగ్ నిందితులు మరిన్ని విషయాలు వెల్లడించారు. గత ఆరు నెలల కాలంలో యంగ్ జర్నలిస్టు, సెక్స్ వర్కర్, చెత్త ఏరుకునే కార్మికురాలితో సహా పలువురిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు తెలిపారు. ఆగస్టు 22న ఫోటోజర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో సలీం అన్సారీ, విజయ్ జాదవ్, మహ్మద్ ఖాసిం, హఫీజ్ షేక్, ఖాసిం బెంగాలీ, సిరాజ్ రెహమాన్ ఖాన్, మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ముంబై 'గ్యాంగ్ రేప్' నిందితులపై మరో కేసు
Published Tue, Sep 3 2013 12:13 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM
Advertisement
Advertisement