హత్నూర (మెదక్) : మాయమాటలు చెప్పి బాలికను మూడో పెళ్లి చేసుకుని చిత్రహింసలకు గురి చేసిన ఓ వ్యక్తితోపాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేసి శనివారం కోర్టుకు రిమాండ్‌కు పంపారు. నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం నాగారం పంచాయతీ కొడిప్యాకకు చెందిన బాలిక(16) తల్లి చనిపోగా తండ్రి ఎల్లాగౌడ్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. బాలిక తాత సంరక్షణలో ఉంటోంది.
ఇదిలాఉండగా నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన దస్తాగౌడ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లయ్యాయి. భార్యలు, పిల్లలు ఉన్నారు. అయితే అతడు తాత సంరక్షణలో ఉన్న బాధిత బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను హైదరాబాద్‌లో ఉంచాడు. ఇళ్లలో పాచిపనులు చేయిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. దీంతో బాధితురాలు రెండు రోజుల క్రితం అక్కడి నుంచి తప్పించుకుని ఎస్పీ సుమతిని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దస్తాగౌడ్, అతని తల్లి గంగమ్మతోపాటు మరో మహిళను శనివారం అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేశారు.
బాలికను మూడో పెళ్లి చేసుకుని హింసించాడు
Published Sat, Feb 6 2016 6:30 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement
Advertisement