
ప్రతీకాత్మక చిత్రం
హుబ్లీ(బెంగళూరు): పెళ్లి నిశ్చయమైన యువతిపై గ్రామ పంచాయతీ సభ్యుడు వేధింపులకు పాల్పడటంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు..ధార్వాడ తాలూకా బేగూర గ్రామానికి చెందిన యువతికి, పొరుగున ఉన్న గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. నెల రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. ఈక్రమంలో తాలూకాలోని ఒక గ్రామ పంచాయతీ సభ్యుడు ఆమెకు ఫోన్ చేసి తనను వివాహం చేసుకోవాలని వేధించాడు. దీంతో ఆ యువతి మంగళవారం పురుగుల మందు తాగింది. జిల్లా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోందని ధార్వాడ గ్రామీణ పోలీసులు తెలిపారు.