
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా అశ్లీల చిత్రాల వీడియోలను పంపుతున్న వ్యక్తిని బుధవారం ఆగ్నేయ విభాగ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్‌చేశారు. మడివాళ బైబీమ్ నగరలో ఉండే 40 ఏళ్ల ఫుడ్ డెలివరి బాయ్ నిందితుడు. అతను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా యువతులు, మహిళలకు పోర్న్‌ను పంపేవాడు. ఫిర్యాదులు రావడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
మరో ఘటనలో..
బావమరిది చేతిలో బావ హతం
కేజీఎఫ్: తాగిన మైకంలో స్వంత బావనే బావమరిది హత్య చేసిన ఘటన బంగారుపేట పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్.ఎ మోహన నగర్‌లో నివాసం జయప్ప (56) తన బామరిది మురళీతో కలిసి మంగళవారం మద్యం తాగి పరస్పరం గొడవ పడ్డారు. ఓ దశలో మురళీ జయప్ప తలపై రాడ్‌తో బలంగా బాదాడు. దీంతో అతను తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు నిందితుడు మురళీని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: భార్య నగ్న ఫొటోలను బంధువులకు షేర్ చేసిన భర్త.. ఆమె ఏం చేసిందంటే?