వేధింపులకు వివాహిత బలి
Published Mon, May 15 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
- థిమెట్ గుళికలు మింగి ఆత్మహత్య
- భర్త, అత్తపై కేసు నమోదు
ఆలూరు రూరల్/ఆదోని టౌన్: వికలత్వం ఉన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇంటి నుంచి రావాల్సినవన్నీ రాబట్టుకున్నాడు. ఒక బిడ్డకు తల్లిని కూడా చేశాడు. ఆ తర్వాత వికలాంగురాలివంటూ వేధింపులు మొదలెట్టాడు. భర్తతోపాటు అత్త వేధింపులు అధికం కావడంతో ఆమె థిమెట్ గుళికలు మింగి ఆదివారం బలవన్మరణానికి పాల్పడింది. ఎస్‌ఐ ధనుంజయ వివరాల మేరకు.. ఆలూరుకు చెందిన ఎల్లప్ప చెల్లెలు ఎల్లమ్మ(29) వికలాంగురాలు. దీంతో ఆమె ఆలనాపాలన కోసం తల్లిదండ్రులు కొంత ఆస్తి రాసిచ్చి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయారు. ఈ క్రమంలో ఎల్లప్ప బతుకు తెరువుకోసం తెలంగాణకు వలస వెళ్లగా ఎల్లమ్మతోపాటు మరో చెల్లి సుజాత ఇంటి వద్ద ఉండేవారు. ఈ క్రమంలో ఆలూరుకే చెందిన రామాంజినమ్మ కుమారుడు ఓబులేష్ మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇంటి నుంచి రావాల్సినవన్నీ భర్త, అత్త రాబట్టుకున్నాడు. తర్వాత వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. ఏడాది క్రితం కూతురు పుట్టింది. రానునారు వేధింపులు పెరిగిపోవడంతో ఆదివారం థిమెట్ గుళికలు మింగింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను ఇరుగుపొరుగు వారు ఆలూరు ఆసుపత్రికి తరించారు. పరిస్థితి విషమించడంతో ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి చెల్లెలు సుజాత ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement